వార్నర్‌ రికార్డును సమం చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌ | SL vs IND 3rd T20: Surya Kumar Yadav Equals David Warner In Most Player Of The Series Awards Category | Sakshi

వార్నర్‌ రికార్డును సమం చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌

Jul 31 2024 9:19 AM | Updated on Jul 31 2024 2:40 PM

SL vs IND 3rd T20: Surya Kumar Yadav Equals David Warner In Most Player Of The Series Awards Category

శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చినందుకు గానూ టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు గెలుచుకున్నాడు. ఈ సిరీస్‌లో స్కై 3 మ్యాచ్‌ల్లో 92 పరుగులే చేసినప్పటికీ.. చాలా కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. మూడో టీ20లో అతను బంతితోనూ (1-0-5-2) మ్యాజిక్‌ చేశాడు. ఫుల్‌ టైమ్‌ కెప్టెన్‌గా స్కైకు ఇది తొలి సిరీస్‌. తొలి సిరీస్‌లోనే స్కై.. ప్రత్యర్ది జట్టును క్లీన్‌ స్వీప్‌ చేశాడు.

టీ20ల్లో స్కైకు ఇది ఐదో ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు. ఈ అవార్డుతో అతను అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. స్కై.. బాబర్‌ ఆజమ్‌, డేవిడ్‌ వార్నర్‌, షకీబ్‌ అల్‌ హసన్‌లతో సమంగా ఐదు ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డులు గెలుచుకున్నాడు. ఈ జాబితాలో విరాట్‌ కోహ్లి (7) టాప్‌లో ఉన్నాడు.

మూడో టీ20 విషయానికొస్తే.. లంకపై భారత్‌ సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేయగా.. ఛేదనలో శ్రీలంక సైతం అన్నే పరుగులు చేసింది. రింకూ సింగ్‌, సూర్యకుమార్‌ చివరి రెండో ఓవర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేసి టీమిండియాను ఓటమి నుంచి గట్టెక్కించారు. 

అనంతరం సూపర్‌ ఓవర్‌లో వాషింగ్టన్‌ సుందర్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి (2/2) భారత్‌ గెలుపుకు బాటలు వేశాడు. సూర్యకుమార్‌ తొలి బంతికే బౌండరీ మ్యాచ్‌ను ముగించాడు. ఈ గెలుపుతో భారత్‌ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేసింది. రెగ్యులర్‌ మ్యాచ్‌లో 2 వికెట్లు, 25 పరుగులు.. సూపర్‌ ఓవర్‌లో 2 వికెట్లు తీసి టీమిండియా గెలుపులో ప్రధానపాత్ర పోషించిన సుందర్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement