
హైదరాబాద్: తెలంగాణలో 604 కొత్త మద్యం బ్రాండ్లకు దరఖాస్తులు వచ్చినట్లు అబ్కారీ శాఖ స్పష్టం చేసింది. ఇందులో 331 రకాల కొత్త ఇండియన్ మేడ్ లిక్కర్ బ్రాండ్లకు దరఖాస్తులు రాగా, 273 రకాల ఫారిన్ లిక్కర్ బ్రాండ్లకు దరఖాస్తులు వచ్చినట్లు తెలిపింది. 47 కొత్త కంపెనీల నుంచి 386 రకాల మద్యం బ్రాండ్డకు దరఖాస్తులు రాగా, 45 పాత కంపెనీల నుంచి 386 రకాల మద్యం బ్రాండ్లకు దరఖాస్తులు వచ్చాయి.
ఈ కొత్త మద్యం బ్రాండ్ల అమ్మకాల అనుమతి కోసం 92 మద్యం సరఫరా కంపెనీలు దరఖాస్తు చేసుకుంది. ఈ మద్యం బ్రాండ్ల కోసం టీజీబీసీఎల్(తెలంగాణ బేవరేజ్ కార్పోరేషన్ లిమిటెడ్) దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఫిబ్రవరి 23వ తేదీన నోటీఫికేషన్ జారీ చేసింది.
బార్స్ అసోసియేషన్ వర్సెస్ తెలంగాణ వైన్స్ డీలర్స్
మరొకవైపు వైన్స్‌లపై బార్స్ అసోసియేషన్ చేసిన వ్యాఖ్యలపై వైన్స్ డీలర్స్ అసోసియేషన్ ఘాటుగా స్పందించింది. మద్యంపై ప్రభుత్వ ఆదాయంలో వైన్స్ ాటా 85 శాతం కాగా, బార్ల నుంచి ప్రభుత్వానికి 15 శాతం వాటానే వస్తోందని ఆరోపించింది. అయినా బార్లకు ఉన్న వెసులుబాటు వైన్ షాపులకు లేవని, బార్లు రాత్రి 12 గంటల వరకూ నడుస్తున్నాయని కౌంటరిచ్చింది. వైన్స్‌లు మాత్రం రాత్రి 10 గంటలకే మూసివేయాలని బార్స్ అసోసియేషన్ అనడం తగదని వైన్స్ డీలర్స్ అసోసియేషన్ పేర్కొంది.