
నేడు ప్రవాస తెలంగాణవాసులతో సమావేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా సీఎం ఎ.రేవంత్‌రెడ్డి శనివారం ఉదయం అమెరికా పర్యటనకు వెళ్లారు. పరిశ్రమలు, ఐటీ శాఖమంత్రి డి.శ్రీధర్‌బాబు, సీఎస్ శాంతికుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్ కూడా ఆయనతో వెళ్లినవారిలో ఉన్నారు.
శనివారం ఉదయం 4.35గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయల్దేరి అమెరికన్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు న్యూయార్క్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆదివారం న్యూజెర్సీలో జరిగే ప్రవాస తెలంగాణవాసులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. 11న అమెరికా నుంచి బయల్దేరి దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు చేరుకోనున్నారు. అక్కడ వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలతో సమావేశాలు నిర్వహిస్తారు. 14న ఉదయం 10.50 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు.
