
సాక్షి,రంగారెడ్డిజిల్లా: వికారాబాద్ కలెక్టర్‌పై కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో జరిగిన దాడి కేసులో బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి బుధవారం(నవంబర్13) కొడంగల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఫార్మా కంపెనీ భూ సేకరణ జరుపుతున్న క్రమంలో కలెక్టర్ ప్రతీక్‌జైన్ సోమవారం లగచర్ల వెళ్లారు.
ఈ సమయంలో కలెక్టర్‌పై పలువురు గ్రామస్తులు దాడి చేశారు. దాడి నుంచి కలెక్టర్ తప్పించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఈ దాడి ఘటనలో వెనుక ఉండి నడిపించింది బీఆర్‌ఎస్ నేత నరేందర్‌రెడ్డి అనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు.
దీంతో కోర్టు నరేందర్‌రెడ్డికి ఈనెల 27 వరకు రిమాండ్ విధించింది. దీంతో నరేందర్‌రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు.లగచర్ల ఘటనలో మంగళవారం 16 మందిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు బుధవారం మరో నలుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు సురేశ్ సోదరుడితో పాటు మరో ముగ్గురు ఉన్నారు.
ఇదీ చదవండి: పట్నం నరేందర్‌రెడ్డి అరెస్ట్.. అప్‌డేట్స్