
సాక్షి, హైదరాబాద్: తుంటిఎముక మార్పిడి చికిత్స తరువాత హైదరాబాద్ నందినగర్‌లోని తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును మాజీ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ దంపతులు ఆదివారం మధ్యాహ్నం పరామర్శించారు. ఈ సందర్భంగా నరసింహన్ దంపతులు కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి గురించి అడిగి తె లుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర ఆవిర్భావం తరువాత జరిగిన అభివృద్ధి, అప్పటి గవర్నర్‌గా నరసింహన్ అందించిన సంపూర్ణ సహకారం చర్చకు వచ్చిన సందర్భంలో కేసీఆర్ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నరసింహన్ దంపతులకు పట్టువ స్త్రాలు సమర్పించి సంప్రదాయపద్ధతిలో అతిథి మర్యాదలు చేశారు. అంతకుముందు కేసీఆర్ నివాసానికి నరసింహన్ దంపతులు చేరుకోగానే బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కె.తారకరామారావు సాదరంగా ఆహ్వానించారు. కేటీఆర్ వెంట మాజీమంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎంపీలు జోగినపల్లి సంతోష్, బీబీ పాటిల్ తదితరులు ఉన్నారు.