
బెట్టింగ్‌లో డబ్బులు పోవడంతోస్నేహితుల మధ్య ఘర్షణ
మృతుడు, నిందితుడు ఒకే గ్రామానికి చెందిన వారు
హత్యకు సహకరించిన మరో ఐదుగురు పరారీ
హైదరాబాద్: ఆన్‌లైన్ బెట్టింగ్ కారణంగా చోటు చేసుకున్న వివాదం హత్యకు దారి తీసిన సంఘటన షాద్‌నగర్ శివారులో ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. శంషాబాద్ ఇన్‌చార్జి, రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ నెల 13న షాద్‌నగర్ లింగారెడ్డిగూడెం శివారులోని ఎంఎస్‌ఎన్ పరిశ్రమ సమీపంలో జాతీయరహదారి పక్కన కత్తిపోట్లకు గురైన గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని గుర్తించిన షాద్‌నగర్, శంషాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మృతుడి కుడి చేయిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా అతను నంద్యాల జిల్లా, బండి ఆత్మకూరు మండలం, చిన్నదేవులాపురం గ్రామానికి చెందిన కిలారి సాయిరాహుల్(23) గుర్తించారు. హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేసిన సాయి రాహూల్ ఉద్యోగం కోసం నగరానికి వచ్చాడు. 11 విన్నర్స్ అనే ఆన్‌లైన్ క్యాసినో బెట్టింగ్‌కు అలవాటు పడ్డాడు.
ఈ క్రమంలో నగరంలోని ఓ పీజీ హాస్టల్‌లో ఉంటున్న తన ఊరికే చెందిన చిన్ననాటి స్నేహితుడు శాఖమురి వెంకటేష్‌కు కూడా బెట్టింగ్ అలవాటు చేశాడు. ఈ క్రమంలో వెంకటేష్ రూ.15 లక్షలు పోగొట్టుకున్నాడు. మూడు నెలల క్రితం కూడా సాయిరాహుల్ మరోమారు అదే గేమ్స్‌లో డబ్బులు పెట్టి తిరిగి సంపాదించుకుందామని చెప్పి వెంకటే‹Ùతో రూ. 3 లక్షలు బెట్టింగ్ పెట్టించాడు. అయితే డబ్బులు పోవడంతో వెంకటేష్ తనకు రూ. 3 లక్షలు ఇవ్వాలని సాయిరాహుల్‌పై ఒత్తిడి చేశాడు. దీంతో సాయిరాహుల్ తనను డబ్బులు అడిగితే చంపేస్తానని బెదిరించాడు.
భయంతోనే హత్యకు కుట్ర..
గతంలోనూ ఓ మారు సాయిరాహుల్ రూ. 20 వేల విషయమై వెంకటేష్‌పై బీరుబాటిల్‌తో దాడి చేశాడు. ఆ తర్వాత తిరిగి స్నేహితులయ్యారు. సాయి తనను హత్య చేస్తాడనే భయంతో వెంకటేష్ తనతో కలిసి హాస్టల్‌లో ఉంటున్న స్నేహితులతో కలిసి సాయిని అంతమొందించాలని పథకం వేశాడు. ఇందుకు రూ. 2 లక్షలు ఇస్తానని చెప్పి కొంత అడ్వాన్స్‌గా ఇచ్చాడు. దీంతో వారు సురారం వెళ్లి కత్తులు కొనుగోలు చేసి అద్దెకారు తీసుకున్నారు.
ఈ నెల 12 సాయిని బెట్టింగ్ పేరుతో లింగారెడ్డిగూడెం రప్పించారు. అతడికి మద్యం తాగించి గొంతుకోయడంతో పాటు కత్తులతో విచక్షణ రహితంగా పొడిచి హత్య చేశారు. అనంతరం బహదూర్‌పల్లి గండిమైసమ్మ సమీపంలోని బంధువుల ఇంట్లో తలదాచుకుని అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. కేసు దర్యాప్తులో భాగంగా ప్రధాన నిందితుడు వెంకటేష్ శనివారం ఉదయం ఆ«రాంఘర్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు. మిగతా నలుగురు నిందితులతో పాటు కారును అద్దెకిచ్చిన వ్యక్తి పరారీలో ఉన్నారు. నిందితుడి నుంచి మూడుఫోన్లు, కారు స్వా«దీనం చేసుకున్నారు. కేసును చేధించిన షాద్‌నగర్ సీఐ విజయ్‌కుమార్, ఎస్‌ఓటీ పోలీసులను డీసీపీ అభినందించారు.