
సాక్షి,హైదరాబాద్: లగచర్ల దాడి ఘటనలో కింది కోర్టు ఇచ్చిన రిమాండ్ ఉత్తర్వులను క్వాష్ చేయాలంటూ పట్నం నరేందర్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.
హైకోర్టులో పట్నం నరేందర్‌రెడ్డి వేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా భూసేకరణకు వ్యతిరేకంగా, ప్రజలను రెచ్చగొట్టే విధంగా నరేందర్ రెడ్డి మాట్లాడారని ప్రభుత్వ న్యాయవాది కోర్టులో వాదించారు. నరేందర్ రెడ్డి రెచ్చగొట్టడం వల్లే ప్రజలకు కలెక్టర్, ఇతర అధికారులపై దాడికి దిగారని అన్నారు. అందుకు తగిన ఆధారాల్ని వీడియోలను సీడీ రూపంలో కోర్టుకు అందించారు.
అయితే, నిబంధనలకు విరుద్ధంగా పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారని ఆయన తరుఫు న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదించారు. ఈ మేరకు ఫోటోలను కోర్టుకు సమర్పించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.