
సాక్షి,హైదరాబాద్:సికింద్రాబాద్ వారసిగూడలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలతో నాలుగురోజుల క్రితం లలిత అనే గృహిణి ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు కుమార్తెలు సైతం తల్లితోపాటు ఆత్మహత్యకు ప్రయత్నించగా ధైర్యం సరిపోక విరమించుకున్నారు.
దీంతో తల్లి మృతదేహంతో కుమార్తెలిద్దరూ నాలుగురోజుల పాటు ఇంట్లోనే ఉంపోయారు. దుర్వాసన వస్తుండడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి ప్రశ్నించగా విషయం బయటపడింది.
తల్లి దహన సంస్కారాలకు డబ్బులు లేవని కుమార్తెలు చెప్పడంతో విషయం పోలీసులకు చేరంది. వెంటనే ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు