
సాక్షి,హైదరాబాద్ : గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో కీచకులు రెచ్చిపోయారు. గణేష్ నవరాత్రల్లో మహిళలను తాకుతూ కీచకులు వేధించారు. ఖైరతాబాద్ గణేష్ వద్ద 11 రోజుల్లో సుమారు వెయ్యిమందిని కీచకుల్ని షీటీమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కీచకులను పట్టుకునేందుకు పోలీసులు స్పై ఆపరేషన్ చేసి అదుపులోకి తీసుకున్నారు.
నిందితులు ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకునేందుకు వచ్చిన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ పట్టుబడ్డారని, తదుపరి చట్టపరమైన చర్యల కోసం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి, తగిన శిక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు.