
సాక్షి, హైదరాబాద్: ఓనమ్ పర్వదినం సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. కాచిగూడ–కొల్లాం (07044/07045) రైలు ఈ నెల 14న సాయంత్రం 4 గంటలకు బయల్దేరి మర్నాడు.. రాత్రి 11.20 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 16వ తేదీ తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లాం నుంచి బయల్దేరి మర్నాడు ఉదయం 9.45 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.
కాగా, వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి పండగకు సొంత గ్రామాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు నిరాశే ఎదురవుతోంది. సంక్రాంతికి నాలుగు నెలల ముందే ప్రధాన రైళ్లలో బెర్తులన్నీ నిండిపోయాయి. వచ్చే ఏడాది జనవరి 11వ తేదీ రిజర్వేషన్లు శుక్రవారం ఉదయం 8 గంటలకు అందుబాటులోకి రాగా.. గోదావరి, విశాఖ, కోణార్క్, ఫలక్‌నుమా తదితర రైళ్లకు 8.05 గంటలకల్లా పూర్తిస్థాయిలో బెర్తులు నిండిపోయాయి. కేవలం ఐదు నిమిషాలలోనే రిజర్వేషన్లు పూర్తయ్యాయి.
ఇదీ చదవండి: కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న విజయనగరం యాత్రికులు