
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించనున్న అర్హత పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులా ల్లో ఐదోతరగతి ప్రవేశాలతో పాటు 6, 7, 8, 9 తరగతుల్లో బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీ కోసం ఈనెల 23న ప్రవేశ పరీక్ష జరగనుంది.

రాష్ట్రవ్యాప్తంగా 446 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 1,67,649 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఐదో తరగతిలో 51,968 సీట్లున్నాయి. మిగిలిన తరగతుల్లో సొసైటీల వారీ గా ఖాళీలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నా యి. ప్రవేశ పరీక్ష వంద మార్కులకు ఉంటుంది. రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభా కర్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.