TS EAMCET 2023 Exam Schedule Changed: Here Are The New Dates - Sakshi

TS EAMCET 2023: ఎంసెట్‌ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు.. కొత్త తేదీలివే!

Mar 31 2023 6:21 PM | Updated on Mar 31 2023 7:08 PM

TS EAMCET 2023 Exam schedule Changed: Here Are The New Dates.. - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ ఎంసెట్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. మే 7వ తేదీ నుంచి జ‌ర‌గాల్సిన ఎంసెట్ ఇంజినీరింగ్ ప‌రీక్ష‌ల తేదీల్లో మార్పులు చేసిన‌ట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్ర‌క‌టించింది. మే 12, 13, 14 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ ప‌రీక్షలు నిర్వ‌హించనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి డా.ఎన్‌.శ్రీనివాసరావు వెల్లడించారు. ఎంసెట్‌ అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులూ లేవని.. మే 10, 11 తేదీల్లోనే యథాతథంగా నిర్వహిస్తామని తెలిపారు.

మే 7న నీట్‌ (యూజీ) పరీక్ష, మే 7, 8, 9 తేదీల్లో టీఎస్‌పీఎస్‌సీ పరీక్షలు ఉండటంతో ఈ మార్పులు చేసినట్టు  పేర్కొన్నారు. కాగా ఎంసెట్‌ దరఖాస్తుల గడువు ఏప్రిల్‌ 4తో ముగియనుంది. ఆలస్య రుసుముతో మే 2 వరకు ఎంసెట్‌ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్‌ 30 నుంచి ఎంసెట్‌ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement