తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. సౌమ్యు డిగా, పార్టీకి విధేయుడిగా పేరున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం.. జయ సమాధి సాక్షిగా రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించారు. ముఖ్యమంత్రి పదవికి తనతో బలవంతంగా రాజీనామా చేయించారని చెప్పి శశికళపై తిరుబాటు బావుటా ఎగరేశారు. ప్రజలు, పార్టీ, ఎమ్మెల్యేలు కోరుకుంటే రాజీనామా వెనక్కి తీసుకోవడానికి సిద్ధమని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా ఏఐఏడీఎంకేలో ప్రకంపనలు పుట్టాయి. పార్టీ చీలిపోయిందనే ఊహాగానాలు చెలరేగాయి.