గుంటూరు నగరంలోని మౌర్య ఫంక్షన్ హాల్లో మంగళవారం జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్’ కార్యక్రమంలో ఐవైఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఐవైఆర్ మాట్లాడుతూ జాతీయోత్పత్తి ఉన్నదానికంటే ఎక్కువగా చూపిస్తూ పోతే చేసిన అప్పు తక్కువగా కనిపిస్తుందని, గత ఐదేళ్లలో ప్రభుత్వం ఇదే పద్ధతిని పాటించిందన్నారు.