ప్రాజెక్టుల కోసమని రైతుల నుంచి భూములను సేకరిస్తుంది..పరిహారం ఇచ్చేసరికి చుక్కలు చూపిస్తోంది. న్యాయబద్ధంగా వ్యవహరించి సంతృప్తి పరచాల్సిన ప్రభుత్వం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తూ బాధిత రైతులను గాలికొదిలేసింది. నిర్లక్ష్యం ఆవరించి నిద్రావస్థలో ఉన్న ప్రభుత్వాన్ని మేల్కొల్పడానికి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఉద్యమానికి సిద్ధమయ్యారు.