సాక్షి, హైదరాబాద్
ఆదిలాబాద్ జిల్లాను చలి గజగజలాడిస్తోంది. గత 24 గంటల్లో 3 డిగ్రీల ఆల్‌టైం రికార్డు ఉష్ణోగ్రత జిల్లాలో నమోదైంది. రాష్ట్ర చరిత్రలో ఇంత తక్కువ ఉష్ణోగ్రత ఇప్పటివరకు నమోదవలేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు. హిమాలయాల నుంచి చలిగాలుల తీవ్రత మరింత పెరగడం, ఆదిలాబాద్ పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో తక్కువ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయని పేర్కొన్నారు.
గత 24 గంటల్లో రాత్రి ఉష్ణోగ్రతకు 9 రెట్లు ఎక్కువగా 28 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత రికార్డయింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. మెదక్‌లో 9 డిగ్రీలు.. భద్రాచలం, ఖమ్మంలలో సాధారణం కంటే 7 డిగ్రీలు తక్కువగా 10 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. పాత ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఖమ్మం జిల్లాల్లో మరో రెండ్రోజులు తీవ్రమైన చలిగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment