పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు | Day time temperatures raised in Telangana | Sakshi
Sakshi News home page

పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు

Published Tue, Jan 2 2018 4:00 AM | Last Updated on Tue, Oct 16 2018 4:56 PM

Day time temperatures raised in Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీల వరకు పెరిగాయి. గత 24 గంటల్లో నల్లగొండ, నిజామాబాద్‌ మినహా మిగిలిన ప్రాంతాల్లో పెరిగాయి. ఖమ్మంలో 4 డిగ్రీలు, భద్రాచలంలో 3 డిగ్రీలు ఎక్కువగా 32 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హన్మకొండ, హైదరాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, రామగుండంలలో 1 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా 31 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. ఆదిలాబాద్, హకీంపేట్, నల్లగొండ, నిజామాబాద్‌లలో 29 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలావుంటే పలుచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలు నమోదుకాగా, మెదక్‌లో 12, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్, రామగుండంలలో 14 డిగ్రీల చొప్పున రికార్డు అయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement