సాక్షి, హైదరాబాద్: తెలంగాణ చలికి గజగజలాడుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాధారణం కంటే 8 డిగ్రీల వరకు తగ్గుతుండటంతో జనం వణికిపోతున్నారు. సాయంత్రం ఆరు దాటిందంటే చాలు చలి తీవ్రతతో జనం ఇబ్బందులు పడుతున్నారు. గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లో మళ్లీ 4 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, ఖమ్మంలోనూ 9 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్‌లో సాధారణం కంటే ఐదు డిగ్రీలు తక్కువగా 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండంలో 10, హైదరాబాద్, హన్మకొండల్లో 11 డిగ్రీలు, నిజామాబాద్‌లో 12, నల్లగొండలో 14, హకీంపేట, మహబూబ్‌నగర్‌లలో 15 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment