కరుణించు... వర్షం కురిపించు! మలగంగమ్మకు ప్రత్యేక పూజలు | కరుణించు... వర్షం కురిపించు! మలగంగమ్మకు ప్రత్యేక పూజలు | Sakshi
Sakshi News home page

కరుణించు... వర్షం కురిపించు! మలగంగమ్మకు ప్రత్యేక పూజలు

Published Wed, Aug 7 2013 4:20 AM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM

కరుణించు... వర్షం కురిపించు!      మలగంగమ్మకు ప్రత్యేక పూజలు

 పెనుమూరు, న్యూస్‌లైన్: ఆ మూడు గ్రామాల ప్రజలు ప్రతి ఏటా వర్షం కోసం ఓ రోజు అడవికి వెళ్తారు. అడవిలో కొండపై కొలువుదీరిన మలగంగమ్మకు పొంగళ్లుపెట్టి వర్షం కురిపించాలని పూజలు చేస్తారు. అనంతరం సామూహికంగా భోజనం చేసి వారి గ్రామాలకు తిరిగి వెళతారు. పెనుమూరు మం డలంలోని చిప్పారపల్లె, సుంచువాండ్లవూరు, సంగీత గోపన్నగారిపల్లెల్లో వర్షాలు కురిస్తే తప్ప పంటలు సాగు చేసేందుకు నీరుండదు. వర్షం కోసం ఈ గ్రామస్తులు మలగంగమ్మకు పూజలు చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. వరుణుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడని ఆ గ్రామస్తుల నమ్మకం. ఈనేపథ్యంలో  మంగళవారం  మలగంగమ్మకు పూజలు చేసేం దుకు ప్రతి ఇంటికీ వెళ్లి పొంగళ్లు పెట్టడానికి ఉయోగించే బిkadయ్యం, బెల్లం సేకరించారు. మధ్యాహ్నం 2 గంటలకు చిప్పారపల్లె నుంచి గ్రామస్తులు మేళతాళాల మధ్య మలగంగమ్మకు పొంగళ్లు, మట్టి కడవల్లో నీటిని తీసుకొని ఊరేగింపుగా అడవికి వెళ్లారు.
 
  ఇంటి దగ్గర నుంచి వచ్చిన మహిళలు ఊరు పొలిమేర దాటగానే తిరిగి వెళ్లిపోయారు. పురుషులు మాత్రమే మలగంగమ్మ ఆలయం వద్దకు వెళ్లి నైవేద్యం సమర్పించారు. జంతుబలి ఇచ్చి మొక్కులు చెల్లించారు. అనంతరం సామూహిక భోజ నాలు చేశారు.  గ్రామం నుంచి మట్టి కడవల్లో తీసుకు వచ్చిన నీటితో అమ్మవారిని అభిషేకించి వర్షం కురిపిం
 చాలని మొక్కుకున్నారు. చివరగా అర్ధనగ్నంగా అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement