గుంటూరు ఎడ్యుకేషన్ : ఎంసెట్ సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ కౌన్సెలింగ్‌కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన విద్యార్థులు వర్ష ప్రభావంతో ఇబ్బందులు పడ్డారు. జిల్లాలోని నాలుగు హెల్ప్‌లైన్ కేంద్రాల పరిధిలో బుధవారం జరిగిన సర్టిఫికెట్ల పరిశీలనకు 1,231 మంది విద్యార్థులు హాజరయ్యారు. 152 మంది విద్యార్థులు కళాశాలల్లో సీట్ల కోసం ఆప్షన్లు ఇచ్చుకున్నారు.
గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలనకు 342, వెబ్ కౌన్సెలింగ్‌కు 55 మంది హాజరయ్యారు. నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలనకు 289, వెబ్ కౌన్సెలింగ్‌కు 22 మంది, సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలనకు 311, వెబ్ కౌన్సెలింగ్‌కు 45 మంది, ఏఎన్‌యూలో సర్టిఫికెట్ల పరిశీలనకు 289, వెబ్ కౌన్సెలింగ్‌కు 30 మంది హాజరయ్యారు. హెల్ప్‌లైన్ కేంద్రాల ఆవరణలో వర్షపునీరు చేరి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు.
నేటి కౌన్సెలింగ్
గురువారం జరిగే సర్టిఫికెట్ల పరిశీలనకు గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 90,001 ర్యాంకు నుంచి 93,700 వరకు, నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 93,701 ర్యాంకు నుంచి 97,500 వరకు, సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 97,501 ర్యాంకు నుంచి 1,01,200 వరకు, ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో 1,01,201 ర్యాంకు నుంచి 1,05,000 వరకు హాజరుకావాలి. 60,001 నుంచి 90 వేల ర్యాంకు వరకు సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకున్న విద్యార్థులు కళాశాలల ఎంపికకు గురు, శుక్రవారాల్లో ఆప్షన్లు ఇచ్చుకోవాలి.
సర్టిఫికెట్ల పరిశీలనకు 1,231 మంది హాజరు
Published Thu, Jun 18 2015 1:20 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement