
తెనాలి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన ఈ నెల 8వ తేదీ రైతు దినోత్సవంగా జరుపుకోనున్న సందర్భంగా ప్రతిష్ట నిమిత్తం డాక్టర్ వైఎస్సార్ కాంస్య విగ్రహం గుంటూరు జిల్లా తెనాలిలో రూపుదిద్దుకుంది. తెనాలికి చెందిన శిల్పకళాసోదరులు పెదపాటి రామాచారి, మల్లికార్జునరావులు ఈ విగ్రహాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
10 అడుగుల ఎత్తు కలిగిన డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి 450 కిలోల కంచును ఉపయోగించగా, విగ్రహ తయారీకి 75 రోజులు పట్టిందని శిల్పకారుడు రామాచారి తెలిపారు. కాగా, ఈ విగ్రహాన్ని 8న శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో రాష్ట్ర శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాం ఆవిష్కరించనున్న నేపథ్యంలో విగ్రహాన్ని ఆదివారం తెనాలి నుంచి ఆముదాలవలసకు తరలించారు.
డాక్టర్ వైఎస్ విగ్రహంతో శిల్పి పెదపాటి రామాచారి
Comments
Please login to add a commentAdd a comment