స్కూల్ బస్సును ఢీకొన్న లారీ
Published Tue, Mar 1 2016 9:34 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తున్న విద్యావికాస్ స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది. దీంతో బస్సు రోడ్డు పక్కన కాల్వలోకి ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా 10 మంది విద్యార్థులు గాయపడ్డారు. క్షతగాత్రులను జంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాఠశాల బస్సు అప్రమత్తతగా లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement