'ఏపీ రాజధానికి వెయ్యి ఎకరాలు చాలు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి వెయ్యి ఎకరాల భూమి సరిపోతుందని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. భూ సేకరణ పేరుతో వేల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయన ఆరోపించారు. శనివారం గవర్నర్ నరసింహన్ను కలసిన అనంతరం రఘువీరా మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు ప్రభుత్వం అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని గవర్నర్కు విన్నవించినట్టు చెప్పారు. గవర్నర్ సానుకూలంగా స్పందించారని రఘువీరా రెడ్డి తెలిపారు. చంద్రబాబు కేబినెట్లో గిరిజనులు, మైనార్టీలకు స్థానం కల్పించలేదని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరో్పించారు. రాష్ట్రంలో 23 లక్షల రేషన్ కార్డులు, 12 లక్షల పింఛన్లు తొలగించారని రఘువీరా రెడ్డి అన్నారు.