మార్కులు తక్కువ వచ్చాయని.. | 10th class student attempts suicide | Sakshi
Sakshi News home page

మార్కులు తక్కువ వచ్చాయని..

Published Thu, Oct 8 2015 4:02 PM | Last Updated on Sun, Sep 3 2017 10:39 AM

10th class student attempts suicide

మదనపల్లె రూరల్ (చిత్తూరు జిల్లా) : మార్కులు తక్కువ వచ్చాయని మనస్థాపానికి గురైన టెన్త్ విద్యార్థిని రైలు కిందపడి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన చిత్తూరు జిల్లా తుమ్మనగుంట రైల్వేస్టేషన్‌లో గురువారం మధ్యాహ్నం జరిగింది. ఈ సంఘటనలో రెండు కాళ్లూ కోల్పోయిన సదరు విద్యార్థిని మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లు గ్రామం మజరా తుమ్మచెట్లపల్లెకు చెందిన సురేంద్ర, ఈశ్వరమ్మ దంపతుల కుమార్తె సి.కల్యాణి అంగళ్లు ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది.

అయితే పాఠశాలలో జరిగిన పరీక్షల్లో సరైన మార్కులు రాకపోవడంతో మనస్థాపానికి గురైంది. గురువారం మధ్యాహ్నం సూసైడ్ నోట్ రాసి తుమ్మగుంట రైల్వేస్టేషన్‌కు వెళ్లి పట్టాలపై పడుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటనలో ఆమె రెండు కాళ్లూ తెగిపోయాయి. గమనించిన స్థానికులు ఆమెను 108లో మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి వెళ్లి విచారించారు. సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement