మదనపల్లి రూరల్ : చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండల కేంద్రంలో ఓ మహిళా రైతు సోమవారం ఆత్మహత్యాయత్నం చేసింది. రాచపాటివారిపల్లికి చెందిన గాదె రాజమ్మ (40) సాగు కోసం సుమారు రూ.3 లక్షల మేర అప్పులు చేసింది. రుణదాతల నుంచి ఒత్తిడి అధికం కావడంతో మనస్తాపం చెందిన ఆమె పురుగుల ముందు సేవించింది. పరిస్థితి విషమంగా ఉండడంతో మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.