విజయవాడ : కృష్ణాజిల్లా నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లె వద్ద లారీలో అక్రమంగా తరలిస్తున్న 19 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని.. పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా లారీ డ్రైవర్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.