ముదినేపల్లిలో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం
Published Tue, Oct 29 2013 8:43 PM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM
కృష్ణా జిల్లాలో పద్నాలుగేళ్ల బాలికపై ఆటోరిక్షా డ్రైవర్ మానభంగం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కృష్ణా జిల్లా ముదినేపల్లిలోని చిగురుకోట గ్రామంలో చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం ఆటోరిక్షాలో బాధితురాలిని మూతపడిన ఓఎన్ జీసీ కార్యాలయం వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్టు గుడివాడ రూరల్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ బి జనార్ధన్ రావు మీడియాకు వెల్లడించారు.
బాధితురాలిని ఆస్పత్రికి తరలించాం. ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది అని సీఐ తెలిపారు. ముదినేపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశాం. ఈ వ్యవహారంలో ఇంకా నిందితుడిని అరెస్ట్ చేయలేదు అని తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని.. అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు అని అన్నారు.
Advertisement
Advertisement