mudinepalli
-
చెన్నూరు కుర్రోడికి ఏడాదికి రూ.1.24 కోట్ల జీతం
సాక్షి, కైకలూరు: కృషి, పట్టుదలతో ముందుకు సాగితే జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని నిరూపించాడు కృష్ణా జిల్లాకు చెందిన బుద్దా కార్తీక్. ముదినేపల్లి మండలం చెన్నూరు గ్రామానికి చెందిన గోపాలకృష్ణమూర్తి, సత్య సులోచనల కుమారుడు కార్తీక్. లిటిల్ ఫ్లవర్ స్కూల్లో పదో తరగతి వరకు విద్యాభ్యాసం చేశాడు. హైదరాబాద్‌లోని బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్)లో ఇంజనీరింగ్ పూర్తి చేసి క్యాల్‌కమ్ మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం పొందాడు. తర్వాత అమెరికాలో కంప్యూటర్ సైన్స్‌లో మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు పూర్తి చేశాడు. ఇప్పుడు అమెజాన్ కంపెనీలో ఏడాదికి రూ.కోటీ 24 లక్షల జీతం అందుకుంటున్నాడు. శుక్రవారం లిటల్ ప్లవర్ స్కూల్ ప్రిన్సిపాల్ బలుసు రఘురామయ్య, వైస్ ప్రిన్సిపాల్ సాయి సుమిత్, ఉపాధ్యాయులు కార్తీక్‌కు అభినందనలు తెలిపారు. -
టీడీపీ కంచుకోటకు బీటలు !
సాక్షి, ముదినేపల్లి : నియోజకవర్గంలో టీడీపీకి కంచుకోటలాంటి ముదినేపల్లి మండలం ఈ ఎన్నికల్లో బీటలు వారే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఓటింగ్ సరళిని బట్టి వైఎస్సార్ సీపీ అధిక్యం సాధిస్తుందనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. మండలంలో 48,262 మంది ఓటర్లు ఉండగా 80శాతంపైగా ఓటింగ్ జరిగినట్లు అంచనా. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తండోపతండాలుగా తరలి రావడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. మండలంలో ఉపాధి హామీ పనులు సైతం పూర్తిగా నిలిచిపోయాయంటే ఓటేసేందుకు ఏస్థాయిలో ఆసక్తి చూపారో తెలుస్తోంది. గతంలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మండల ఓటర్లు టీడీపీకే పట్టం కట్టారు. ప్రస్తుత పరిస్థితి అందుకు విరుద్ధంగా మారినట్లు పలు గ్రామాల్లోని ఓటింగ్ సరళి స్పష్టం చేస్తోంది. టీడీపీకి అండగా ఉండే బీసీ ఓటర్లు సైతం ఈఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి పూర్తిగా అండగా నిలవడంతో పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అదే విధంగా మండలంలో అత్యధిక సంఖ్యలో ఉన్న ఎస్సీ ఓటర్లు పార్టీకి పూర్తి అండగా నిలిచి జగన్‌పై అభిమానాన్ని చాటుకున్నారు. మండలంలోని 32 గ్రామాల్లో కేవలం 10లోపు గ్రామాల్లో మాత్రమే టీడీపీ మెజార్టీ సాధించే అవకాశాలున్నాయని మిగిలిన అన్ని గ్రామాల్లో వైఎస్సార్ సీపీ అధిక్యం సాధిస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు. డ్వాక్రా మహిళలు, రైతులు అండగా నిలుస్తారని అంచనా వేసిన టీడీపీ నేతల ఆశలు తలకిందులయ్యాయి. రుణాలు రద్దు చేస్తానని హామీ ఇచ్చి నెరవేర్చకుండా ఎన్నికల ముందు పసుపు–కుంకుమ, అన్నదాత సుఖీభవతో మోసం చేయాలని భావించిన చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పనున్నట్లు మహిళలు, రైతులు వ్యాఖ్యానించడం గమనార్హం. దీనిని బట్టి చూస్తే అన్ని వర్గాల ప్రజలు వైఎస్సార్ సీపీకి అండగా నిలిచి టీడీపీ కంచుకోటను కూల్చుతారనడంలో సందేహం లేదనే అభిప్రాయం సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. -
ఓటుకు పోటెత్తిన జనం
సాక్షి, ముదినేపల్లి : మండలంలో గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓటేసేందుకు జనం పోటెత్తారు. ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఓటర్లు గురువారం ఉదయానికే పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటేసేందుకు చేరుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్రాల వద్ద బారులు తీరారు. సరైన శిక్షణలేని పోలింగ్ సిబ్బంది, ఈవీఎంల మొరాయింపుతో ఓటింగ్‌లో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో అనేక పోలింగ్ కేంద్రాల్లో ఓటేసేందుకు గంటల కొద్దీ నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. బొమ్మినంపాడు శివారు గొల్లగూడెం 98వ పోలింగ్ కేంద్రంలో ఉదయం 7గంటలకు ప్రారంభించాల్సిన ఓటింగ్ ప్రక్రియ ఈవీఎం సక్రమంగా పనిచేయనందున గంట ఆలస్యంగా ప్రారంభమైంది. అప్పటికే కేంద్రం వద్ద ఓటర్లు భారీసంఖ్యలో బారులు తీరారు. వైవాక శివారు పెదగరువు 108వ బూత్‌లో ఇదే పరిస్థితి ఏర్పడింది. స్వల్ప సంఘటనల మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో సిబ్బంది, నేతలు ఊపిరి పీల్చుకున్నారు. కలిదిండిలో 80 శాతం... కలిదిండి మండలంలో గురువారం నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం పోలింగ్ ప్రారంభంలో పలుగ్రామాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభించారు. దీనికి తోడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు తీవ్ర నిరాశ పరిచింది. రెండు భవనాలు ఉన్న గ్రామంలో ఒకే భవనంలో రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం, కొన్ని గ్రామాల్లో మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంపై ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. ఎండ తీవ్రతకు కొందరు ఉదయం పోలింగ్ కేంద్రాలకు రాలేదు. పనులు ముగించుకుని రెండవ పూట భారీగా హాజరయ్యారు. మండలంలో మూలలంక, పౌలుపేట, తాడినాడ, చిన తాడినాడ గ్రామాల్లో పోలింగ్ ఆలస్యంగా జరిగింది. భాస్కరరావుపేట, తాడినాడ, సానారుద్రవరం, కోట కలిదిండి గ్రామాల్లో ఏడుగంటల తరువాత కూడా పోలింగ్ నిర్వహించారు. మొత్తానికి 80 శాతం పోలింగ్ నమోదైనట్టు తహసీల్దార్ కనకరాజు తెలిపారు. పోలీసులు తగిన భద్రత కల్పించడంతో మొత్తానికి పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మండవల్లిలో 84శాతం... మండవల్లి మండలంలో 37,791 ఓటర్లుకు గాను, 84 శాతం పోలింగ్ జరిగినట్లు తహసీల్దార్ పీవీ రమణకుమారి తెలిపారు. ఉదయం 7 గంటలకు ప్రారంభం కావలసిన పోలింగ్ పలు బూత్‌లలో ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు గంటల తరబడి క్యూలైన్లలో వేచిఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండవల్లి మండలంలో 29 గ్రామాలు ఉండగా సుమారు 11 గంటల వరకు పోలింగ్ సక్రమంగా జరగలేదు. మండల పరిధిలో 49 పోలింగ్ బూత్‌లలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో కొందరు ఓటర్లు ఎక్కువసేపు లైన్లో ఉండలేక ఇంటికి వెళ్లి మళ్లీ వద్దామని అనుకుని వెళ్లి తిరిగి 4గంటలు దాటిన తర్వాత ఓటు వేయడానికి వస్తే ఓటు వేయడానికి బాగా జాప్యం జరిగి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుమారు 7 గంటల వరకు పోలింగ్ జరుగుతూనే ఉంది. కొవ్వాడలంక గ్రామంలో స్వల్ప ఘర్షణ చేసుకుంది. తక్కెళ్లపాడు గ్రామంలో 90 సంవత్సరాల వృద్ధురాలు ఓటు హక్కు వినియోగించుకుంది. కైకలూరులో... పోలింగు ఈవీఎంలు ఓటర్లును ఇబ్బందులు పెట్టాయి. సాంకేతికలోపం, అవగాహన రాహిత్యం వెరసి ఓటర్లు గంటల తరబడి మలమలమాడారు. కైకలూరు నియోజకవర్గంలో కైకలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి మండలాల్లో మొత్తం 234 పోలింగు బూత్‌లలో గురువారం పోలింగు జరిగింది. నియోజకవర్గాన్ని మొత్తం 12 సెక్టర్లు, 24 రూట్లుగా విభజించారు. ఈ ఏడాది ఎవరికి ఓటు వేశామనేది తిలకించే వీవీప్యాడ్లు తికమకపెట్టాయి. స్వల్ప సంఘటనల నడుమ పోలింగు ప్రశాతంగా ముగిసింది. ఓటు హక్కును ఉపయోగించుకున్న అభ్యర్థులు.. అసెంబ్లీకి పోటి చేసిన పలు పార్టీల అభ్యర్థులు ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు కైకలూరులో, టీడీపీ అభ్యర్థి జయమంగళ వెంకటరమణ కొట్టాడ గ్రామంలో, బీజేపీ అభ్యర్థి కీర్తి వెంకట రామప్రసాద్, స్వతంత్య్ర అభ్యర్థి భూపతిరాజు రమేష్ కుమార్ రాజులు కైకలూరులో, మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ స్వగ్రామమైన వరహాపట్నం గ్రామంలో ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. వైఎస్సార్, టీడీపీ అభ్యర్థులు ఆయా పోలింగు బూత్‌లలో జరిగే పోలింగు సరళిని పరిశీలించారు. -
157వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
-
157వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
సాక్షి, కైకలూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం 157వ రోజు పాదయాత్రను కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి శివారు నుంచి వైఎస్ జగన్ ప్రారంభించారు. ఆయనతో కలిసి నడిచేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారందరినీ ఆప్యాయంగా పలకరించి జననేత ముందుకు కదిలారు. పెయ్యేరు, డాకరం క్రాస్, కానుకొల్లు, పుట్ల చెరువు క్రాస్, లింగాల మీదుగా ఈరోజు పాదయాత్ర కొనసాగుతుంది. పెరికగూడెంలో దళితుల ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్ జగన్ పాల్గొంటారు. సమావేశం అనంతరం రాత్రికి ఆయన ఇక్కడే బస చేస్తారు. -
ముదినేపల్లి హైస్కూల్లో అగ్ని ప్రమాదం
ముదినేపల్లి రూరల్ : మండల కేంద్రమైన ముదినేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కంప్యూటర్ ల్యాబ్‌లో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రూ.4 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. కొందరు దుండగుల దుశ్చర్య కారణంగా ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. పాఠశాల మొదటి అంతస్తులో డిజిటల్ తరగతుల నిర్వహణకు ఇటీవల కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించారు. ఈ ల్యాబ్‌లో 11 కంప్యూటర్లు, ప్రొజెక్టర్, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం పాఠశాల వదలిన వెంటనే తరగతి గదులకు, వరండా గేట్లకు ఉపాధ్యాయులు తాళాలు వేసి వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం కంప్యూటర్ ల్యాబ్ నుంచి పొగ రావడాన్ని స్థానికులు గమనించి ప్రధానోపాధ్యాయుడు డి.వి.ఎం.శాసి్త్రకి సమాచారం అందించారు. హెచ్ఎం ఫిర్యాదు మేరకు ఎస్ఐ జి.ఏసుబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ల్యాబ్‌లోని ప్రొజెక్టర్, రెండు కం ప్యూటర్లు మాయమైనట్లు గుర్తించారు. మిగిలిన కంప్యూటర్లు పాక్షికంగా కాలిపోయాయి. సౌండ్ సిస్టమ్‌కు సంబంధించిన పరికరాలను కుప్పగా పోసి తగులబెట్టినట్లు ఘట నాస్థలంలోని ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడ పడివున్న రంపపు బ్లేడును బట్టి దుండగులు తాళాలను కోసివేసి ల్యాబ్‌లోనికి ప్రవేశించారని పోలీసులు అనుమానిస్తున్నారు. మచిలీపట్నం నుంచి వచ్చిన క్లూస్ టీమ్ ఆధారా లు సేకరించింది. రోజూ పాఠశాల పనివేళలు ముగిసిన వెంటనే విద్యుత్ లైన్ మెయిన్లను కట్టివేస్తారు. ఈ నేపథ్యం లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగే అవకాశం లేదని గుర్తించారు. ఘటనా స్థలాన్ని జెడ్పీటీసీ సభ్యురాలు భూపతి నాగకల్యాణి, ఎంపీపీ పోసిన కుమారి, పోసిన పాండు రంగారావు, ఎస్ఎంసీ చైర్మన్ టి.హనూక్ పరిశీలించారు. పాఠశాలకు వాచ్‌మన్lలేనందునే ఈ ఘటన జరిగిందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. వాచ్‌మన్ ఉద్యోగ విరమణ చేశాక పోస్టును భర్తీ చేయలేదని తెలిపారు. గ్రామాలకు చివరన ఉండి, వాచ్‌మన్ లేని పెదపాలపర్రు, గురజ హైస్కూళ్లలోనూ గతంలో కంప్యూటర్లు చోరీకి గురయ్యాయి. -
ఆర్టీసీ బస్సు బోల్తా : ముగ్గురికి గాయాలు
ముదినేపల్లి : కృష్ణా జిల్లా ముదినేపల్లి సమీపంలో సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సు బోల్తాపడి డ్రైవర్ సహా ముగ్గురు గాయపడ్డారు. భీమవరం నుంచి విజయవాడకు వెళుతున్న ఆర్టీసీ బస్సు విశ్వనాథపాళెం వద్ద జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న గేదెను తప్పించబోయి రోడ్డుపక్కన గోతిలో బోల్తాపడింది. ఈ సంఘటనలో డ్రైవర్ సహా ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. -
టైరు పేలి ఆటో బోల్తా- ముగ్గురికి గాయాలు
కృష్ణా : వేగంగా వెళ్తున్న ఆటో టైరు పేలడంతో బోల్తా పడింది. ఈ సంఘటన మంగళవారం కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం చినపాలపర్రు గ్రామంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. స్తానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను గుడివాడ ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. (ముదినేపల్లి) -
చాకిరేవే చావు రేవైంది..
చాకిరేవే చావు రేవైంది.. ముదినేపల్లి : అభం శుభం తెలియని ఇద్దరు బాలికలు చెరువులో బట్టలు ఉతికేం దుకు వెళ్లి నీట మునిగి దుర్మరణం పాలైన హృదయ విదారక సంఘటన మండలంలోని గురజలో సోమవారం జరిగింది. గురజ ఎస్టీ కాలనికి చెందిన డేగల నాగరాజు, అనంత దంపతులకు నలుగురు కుమారైలు, ఒక కుమారుడు ఉన్నారు. వారిలో రెండో కుమారై చిన్నమ్మ (13) మూగబాలిక. స్థానిక హోటల్లో పనిచేస్తోంది. మూడో కుమారై మాధవి (10) స్థానిక ప్రాథమిక పాఠశాలాలో మూడో తరగతి చదువుతోంది. వీరు రోజూ స్థానికంగా ఉన్న చాకిరేవులో బట్టలు ఉతికేందుకు వెళ్తుంటారు. ఇదే క్రమంలో సోమవారం రెండో పూట చిన్నమ్మ హోటల్ పని నుంచి, మాధవి స్కూల్ నుంచి ఇంటికి చేరుకున్నారు. అనంతరం రెండు బకెట్లలో బట్టలు తీసుకుని చెరువు వద్దకు వెళ్లారు. బట్టలు ఉతికేందుకు వెళ్లిన కుమారైలు ఎంతకీ తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనతో చెరువు వద్దకు వెళ్లి చూడగా గట్టుపై బట్టలతో ఉన్న బకెట్లు మాత్రమే కనిపించాయి. సమీపంలో ఉన్న కాలనీలో బంధువుల ఇంటికి వెళ్లి ఉంటారని ఆరా తీశారు. అయితే వారు తమ ఇళ్లకు రాలేదని బంధువులు చెప్పడంతో అనుమానం వచ్చి చెరువులో గాలిం చగా బాలికల మృతదేహాలు లభిం చాయి. వాటిని చూసిన తల్లిదండ్రులు భోరున విలపించారు. ఈ సమాచారం అందుకున్న తహశీల్దార్ ఎం.సూర్యారావు, ఆర్ఐ జి.గౌతమ్‌కుమార్, సర్పంచి కె.వెంకటేశ్వరరావు, మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు శేవా నాగజగన్‌బాబూరావు, గురజ ఎంపీటీసీ మాజీ సభ్యుడు జోగి శివప్రసాద్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రభుత్వ పరంగా బాధితులకు సహాయం అందించేందుకు కృషిచేస్తానని తహశీల్దార్ పేర్కొన్నారు. -
అనైతిక కార్యకలాపాలను విడనాడాలి
ముదినేపల్లి రూరల్, : ప్రజలు అనైతిక కార్యకలాపాలను విడనాడి శాంతి భద్రతలను పరిరక్షించేందుకు సహకరించాలని ముదినేపల్లి ఎస్ఐ వి.సతీష్ కోరారు. మండలంలోని బొమ్మినంపాడు శివారు జానకిగూడెం, పాత, కొత్త దళితవాడలు, కొరగుంటపాలెం, శ్రీహరిపురం గ్రామాల్లో మంగళవారం జనమైత్రి సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ జూదాలు, మద్యపానం విడనాడితేనే సమాజంలో గౌరవప్రదమైన హోదా దక్కుతుందన్నారు. గ్రామాల్లో ఘర్షణలకు తావు లేకుండా స్థానికంగా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచిం చారు. ఆయా గ్రామాల సర్పంచులు నేతల రూప, అచ్యుత రాంబాబు, బడుగు జయమ్మ, పలువురు వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
‘కొల్లేర’వుతున్నా పట్టించుకోరా?
=యథేచ్ఛగా చేపల చెరువులు తవ్వకం = నిబంధనలు గాలికి... = పట్టించుకోని అధికారగణం ముదినేపల్లి రూరల్, న్యూస్‌లైన్ : పట్టా, అసైన్డ్, పోరంబోకుతో సహా పచ్చని పైరుతో కళకళలాడుతున్న ముదినేపల్లి మండలంలోని భూములన్నీ నేడు కొల్లేరును తలపిస్తున్నాయి. ఈ ప్రాంతంలోని బడా బాబులు సెంటు భూమినీ వదలకుండా విచ్చలవిడిగా చేపలు, రొయ్యల చెరువులుగా మార్చేయడమే దీనికి కారణం. ఓ వైపు రాజ కీయ పలుకుబడి, మరోవైపు ధనబలంతో ఉన్న వారు లొంగదీసుకుంటున్నందు వల్లే సంబంధిత అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. భూములను చెరువులుగా మార్చాలంటే చిత్తడి నేలలు మాత్రమే ఉండాలి. ఇతర భూముల్లో కానీ.. పంటభూముల్లోకానీ చెరువులు తవ్వేందుకు నిబంధనలు అనుమతించవు. అలాగే సాగునీటిని అస్సలు వినియోగించకూడదు. వీటన్నింటికీ తోడు సరిహద్దు రైతులు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకూడదు. ఇవన్నీ ఉంటేనే మండల స్థాయి కమిటీ దరఖాస్తులు పరిశీలిస్తుంది. ఆపై డివిజన్, జిల్లా స్థాయి కమిటీలు ఆమోదించిన తరువాత మాత్రమే చెరువుల తవ్వకాలు చేపట్టాలి. మండలంలో మాత్రం ఇలాంటి నిబంధనలు ఎక్కడా పాటించడంలేదనే విమర్శలొస్తున్నాయి. అనేక గ్రామాల్లో పంట భూములన్నీ చెరువులుగా మారిపోయినా రెవెన్యూ రికార్డుల్లో మాత్రం ఇప్పటికీ ఆ భూముల్లో వరిసాగు జరుగుతున్నట్లు నమోదు చేయడం గమనార్హం. వైవాక, ఊటుకూరు, దేవపూడి, చిగురుకోట, పెదగొన్నూరు తదిత ర గ్రామాల్లో నిబంధనలు అతిక్రమించి చెరువులు తవ్వినా సంబంధిత వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పత్రికల్లో వార్తలు వెలువడిన రోజున మాత్రం మొక్కుబడిగా ఒకటి రెండు పొక్లెయిన్లు స్వాధీనం చేసుకుని నామమాత్రపు జరిమానా వేసి వదలివేస్తున్నారు. తవ్వకాలకు పెద్ద మొత్తంలో వ్యయం చేస్తున్న బడా బాబులపై ఇలాంటి జరిమానాలు ఏమాత్రం ప్రభావం చూపడంలేదు. మాట వినని రెవెన్యూ అధికారులపై రాజకీయ పలుకుబడి ఉపయోగిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. దీంతో ఉద్యోగ భద్రతకోసం అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తూ తవ్వకాలకు పరోక్షంగా తమవంతు సహకారాన్ని అందిస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. కొంతమంది వీఆర్వోలు బడా బాబులను రెవెన్యూ అధికారుల కార్యాలయాలకు తీసుకెళ్లి తవ్వకాలకు ఆమోద ముద్ర వేయిస్తున్నారు. పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే అతి తక్కువ కాలంలోనే మండలం మొత్తం కొల్లేరుకు ప్రతిరూపంగా మారుతుందనడంలో సందేహం లేదనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని చెరువుల తవ్వకాలపై ఉక్కుపాదం మోపాలని కోరుతున్నారు. -
ముదినేపల్లిలో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం
కృష్ణా జిల్లాలో పద్నాలుగేళ్ల బాలికపై ఆటోరిక్షా డ్రైవర్ మానభంగం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కృష్ణా జిల్లా ముదినేపల్లిలోని చిగురుకోట గ్రామంలో చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం ఆటోరిక్షాలో బాధితురాలిని మూతపడిన ఓఎన్ జీసీ కార్యాలయం వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్టు గుడివాడ రూరల్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ బి జనార్ధన్ రావు మీడియాకు వెల్లడించారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించాం. ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది అని సీఐ తెలిపారు. ముదినేపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశాం. ఈ వ్యవహారంలో ఇంకా నిందితుడిని అరెస్ట్ చేయలేదు అని తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని.. అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు అని అన్నారు.