ముదినేపల్లి హైస్కూల్‌లో అగ్ని ప్రమాదం
ముదినేపల్లి హైస్కూల్‌లో అగ్ని ప్రమాదం
Published Mon, Sep 5 2016 1:04 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
ముదినేపల్లి రూరల్ :
మండల కేంద్రమైన ముదినేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కంప్యూటర్ ల్యాబ్‌లో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రూ.4 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. కొందరు దుండగుల దుశ్చర్య కారణంగా ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. పాఠశాల మొదటి అంతస్తులో డిజిటల్ తరగతుల నిర్వహణకు ఇటీవల కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించారు. ఈ ల్యాబ్‌లో 11 కంప్యూటర్లు, ప్రొజెక్టర్, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం పాఠశాల వదలిన వెంటనే తరగతి గదులకు, వరండా గేట్లకు ఉపాధ్యాయులు తాళాలు వేసి వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం కంప్యూటర్ ల్యాబ్ నుంచి పొగ రావడాన్ని స్థానికులు గమనించి ప్రధానోపాధ్యాయుడు డి.వి.ఎం.శాసి్త్రకి సమాచారం అందించారు. హెచ్‌ఎం ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ జి.ఏసుబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ల్యాబ్‌లోని ప్రొజెక్టర్, రెండు కం ప్యూటర్లు మాయమైనట్లు గుర్తించారు. మిగిలిన కంప్యూటర్లు పాక్షికంగా కాలిపోయాయి. సౌండ్ సిస్టమ్‌కు సంబంధించిన పరికరాలను కుప్పగా పోసి తగులబెట్టినట్లు ఘట నాస్థలంలోని ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడ పడివున్న రంపపు బ్లేడును బట్టి దుండగులు తాళాలను కోసివేసి ల్యాబ్‌లోనికి ప్రవేశించారని పోలీసులు అనుమానిస్తున్నారు. మచిలీపట్నం నుంచి వచ్చిన క్లూస్ టీమ్ ఆధారా లు సేకరించింది. రోజూ పాఠశాల పనివేళలు ముగిసిన వెంటనే విద్యుత్ లైన్ మెయిన్లను కట్టివేస్తారు. ఈ నేపథ్యం లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగే అవకాశం లేదని గుర్తించారు. ఘటనా స్థలాన్ని జెడ్పీటీసీ సభ్యురాలు భూపతి నాగకల్యాణి, ఎంపీపీ పోసిన కుమారి, పోసిన పాండు రంగారావు, ఎస్‌ఎంసీ చైర్మన్ టి.హనూక్ పరిశీలించారు. పాఠశాలకు వాచ్‌మన్lలేనందునే ఈ ఘటన జరిగిందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. వాచ్‌మన్ ఉద్యోగ విరమణ చేశాక పోస్టును భర్తీ చేయలేదని తెలిపారు. గ్రామాలకు చివరన ఉండి, వాచ్‌మన్ లేని పెదపాలపర్రు, గురజ హైస్కూళ్లలోనూ గతంలో కంప్యూటర్లు చోరీకి గురయ్యాయి.
Advertisement
Advertisement