Computer lab
-
ముదినేపల్లి హైస్కూల్లో అగ్ని ప్రమాదం
ముదినేపల్లి రూరల్ : మండల కేంద్రమైన ముదినేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కంప్యూటర్ ల్యాబ్‌లో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రూ.4 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. కొందరు దుండగుల దుశ్చర్య కారణంగా ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. పాఠశాల మొదటి అంతస్తులో డిజిటల్ తరగతుల నిర్వహణకు ఇటీవల కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించారు. ఈ ల్యాబ్‌లో 11 కంప్యూటర్లు, ప్రొజెక్టర్, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం పాఠశాల వదలిన వెంటనే తరగతి గదులకు, వరండా గేట్లకు ఉపాధ్యాయులు తాళాలు వేసి వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం కంప్యూటర్ ల్యాబ్ నుంచి పొగ రావడాన్ని స్థానికులు గమనించి ప్రధానోపాధ్యాయుడు డి.వి.ఎం.శాసి్త్రకి సమాచారం అందించారు. హెచ్ఎం ఫిర్యాదు మేరకు ఎస్ఐ జి.ఏసుబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ల్యాబ్‌లోని ప్రొజెక్టర్, రెండు కం ప్యూటర్లు మాయమైనట్లు గుర్తించారు. మిగిలిన కంప్యూటర్లు పాక్షికంగా కాలిపోయాయి. సౌండ్ సిస్టమ్‌కు సంబంధించిన పరికరాలను కుప్పగా పోసి తగులబెట్టినట్లు ఘట నాస్థలంలోని ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడ పడివున్న రంపపు బ్లేడును బట్టి దుండగులు తాళాలను కోసివేసి ల్యాబ్‌లోనికి ప్రవేశించారని పోలీసులు అనుమానిస్తున్నారు. మచిలీపట్నం నుంచి వచ్చిన క్లూస్ టీమ్ ఆధారా లు సేకరించింది. రోజూ పాఠశాల పనివేళలు ముగిసిన వెంటనే విద్యుత్ లైన్ మెయిన్లను కట్టివేస్తారు. ఈ నేపథ్యం లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగే అవకాశం లేదని గుర్తించారు. ఘటనా స్థలాన్ని జెడ్పీటీసీ సభ్యురాలు భూపతి నాగకల్యాణి, ఎంపీపీ పోసిన కుమారి, పోసిన పాండు రంగారావు, ఎస్ఎంసీ చైర్మన్ టి.హనూక్ పరిశీలించారు. పాఠశాలకు వాచ్‌మన్lలేనందునే ఈ ఘటన జరిగిందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. వాచ్‌మన్ ఉద్యోగ విరమణ చేశాక పోస్టును భర్తీ చేయలేదని తెలిపారు. గ్రామాలకు చివరన ఉండి, వాచ్‌మన్ లేని పెదపాలపర్రు, గురజ హైస్కూళ్లలోనూ గతంలో కంప్యూటర్లు చోరీకి గురయ్యాయి. -
అధికారులను వదిలి.. అల్పులపై వేటు
తెలంగాణ విద్యార్థులకు ఏపీ ఇంటర్ బోర్డు మెమోల జారీలో చర్యలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు నుంచి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ బోర్డు పేరుతో మెమోలు జారీ చేసిన వ్యవహారంలో అధికారులను వదిలేసి.. కిందిస్థాయి సిబ్బందిపై విద్యాశాఖ వేటువేసింది. అసలు పొరపాటు ఎక్కడ జరిగింది.. ఎలా జరిగింది.. విశ్లేషించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకుండా కిందిస్థాయి సిబ్బంది ముగ్గురిని (సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్) సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంది. పొరపాటు జరగడానికి కారణమైన ఉన్నత ఆధికారులు, ముందుగా పక్కా చర్యలు చేపట్టడంలో విఫలమైన పరీక్షల విభాగం అధికారులను పట్టించుకోకుండా ఈ చర్యలకు దిగడంపై ఇంటర్ బోర్డు ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2014 జూన్ కంటే ముందే ఇంటర్ బోర్డు సిబ్బందిని అనధికారికంగానే విభజించారు. కానీ, రెండు రాష్ట్రాలకు ఒకే కంప్యూటర్ ల్యాబ్‌ను కొనసాగించారు. దీనిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంలో ముందుగా చర్యలు చేపట్టాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్ మెమోలు ముద్రితమయ్యే ల్యాబ్‌లోనే తెలంగాణ మెమోలను ముద్రించేందుకు అనుమతి ఇచ్చిన అధికారులపై చర్యలు చేపట్టాలని సిబ్బంది పేర్కొంటున్నారు. ఆ తరువాత మార్కులను ముద్రించే మెమో పేపర్ ఇచ్చిన అధికారులపై చర్యలు చేపట్టాలని చెబుతున్నారు. ఆ పేపరు ఇచ్చాకే విద్యార్థుల పేర్లు, మార్కులు ముద్రిస్తారని, బోర్డు పేరు ముందుగానే ముద్రించి ఉన్నా తప్పుడు పేపరు ఇచ్చిన ఆ అధికారులను వదిలేసి సిబ్బందిని బాధ్యులను చేయడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. -
విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని ఎంచుకోవాలి
పర్వతగిరి , న్యూస్‌లైన్ : విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని ఎంచుకుని సాధన చేస్తే అత్యున్నత స్థానానికి చేరుకుంటారని ప్రముఖ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. శనివారం మండలంలోని కల్లెడ రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ (ఆర్డీఎఫ్) పాఠశాలను సందర్శించి కంప్యూటర్ ల్యాబ్, విద్యార్థుల సైన్స్‌ఫేర్, బాలా మేళాను తిలకిం చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్ననాటి నుంచే విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నతస్థాయికి చేరుకోవాలన్నారు. మం చి లక్ష్యాన్ని ఎంచుకుని అంకితభావంతో కృషి చేస్తే సాధించలేనిది ఏమీ లేదన్నారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. నేటి బాలలే రేపటి పౌరులని, భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నా రు. ఆర్డీఎఫ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కల్లెడ రూరల్ పాఠశాలలో పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించడంతో పాటు జి ల్లాలో మూడు పాఠశాలలను నిర్వహించడం హర్షణీయమన్నారు. పల్లెల్లో ఇలాంటి మంచి పాఠశాలను సందర్శించడం తనకు ఓ మధురానుభూతిని ఇచ్చిందన్నారు. ఈ సందర్భంగా పలువురు పాఠశాల విద్యార్థులు చేసిన ఎగ్జిబిట్స్ను పరిశీలించారు. విద్యార్థులతో తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీఎఫ్ సీఈఓ ఎర్రబెల్లి వం దితారావు, హెచ్ఎంలు శ్రీధర్, చేరాలు, అసిస్టెంట్ హెచ్ఎం రాచకొండ అశోకాచారి, ఉపాధ్యాయులు మహేందర్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, మురళీకృష్ణ, అశోక్, పాఠశాల విద్యా క మిటీ సభ్యులు రమేశ్, రామలింగం, ముస్తఫా, మోహన్, సారంగపాణి పాల్గొన్నారు.