
స్విమ్స్‌లో ఎన్‌ఆర్‌ఐ కోటా 15 శాతం సీట్లు
సాక్షి, హైదరాబాద్: తిరుపతిలోని పద్మావతి మహిళా వైద్య కళాశాలలో ఈ ఏడాది చేరగోరే ఎన్నారై విద్యార్థులకు 15 శాతం సీట్లు కేటాయించాలని స్విమ్స్ పాలకమండలి సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ కళాశాలలో ఎన్‌ఆర్‌ఐ విద్యార్థులకు 20 వేల డాలర్లు ఫీజుగా పేర్కొన్నారు. రాష్ట్రేతర విద్యార్థులకు 15 శాతం సీట్లు, రూ.60 వేల ఫీజుగా నిర్ణయించారు. రాష్ట్ర వాసులకు రూ. 60 వేల ఫీజుతో మిగిలిన 70 శాతం సీట్లు కేటాయించారు.