15 టన్నుల రేషన్ బియ్యం సీజ్
Published Thu, Nov 14 2013 11:46 PM | Last Updated on Sat, Sep 2 2017 12:36 AM
పెదకాకాని, న్యూస్‌లైన్: అక్రమంగా తరలిస్తున్న 15 టన్నుల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు బుధవారం అర్ధరాత్రి దాడిచేసి పట్టుకున్నారు. ఆటోనగర్ నుండి చిత్తూరు జిల్లా బి కొత్తకోట తరలి వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యం లారీని సీజ్ చేశారు. ఆ వివరాలను గురువారం విజిలెన్స్ ఎస్పీ అమ్మిరెడ్డి విలేకరులకు వివరించారు. సుమారు 15 టన్నుల రేషన్ బియ్యం తరలించడానికి లారీ సిద్ధంగా ఉందని సమాచారం అందడంతో విజిలెన్స్ సీఐ కిషోర్ సిబ్బందితో ఆటోనగర్ చేరుకుని లారీని స్వాధీనం చేసుకున్నారు.
వీటి విలువ సుమారు రూ.3 లక్షలు. లారీ డ్రైవర్ శంకరరెడ్డి, క్లీనర్ బాషాలను అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు నెహ్రూనగర్‌కు చెందిన కొల్లిపర సుబ్బారావు, శ్రీనగర్‌కు చెందిన అనీల్, సాదు ప్రసాద్ సిండికేట్‌గా ఏర్పడి గుంటూరు నగరంలోని పలు డీలర్ల నుండి రేషన్ బియ్యం సేకరించి వాటిని వేరే గోతాలకు మార్చి ఆటోనగర్‌కు చేర్చడం, అక్కడి నుండి చెన్నై, కర్ణాటకలకు తరలిస్తున్నారు. లారీ డ్రైవర్, క్లీనర్ లతో పాటు సుబ్బారావు, అనిల్, ప్రసాద్‌లపై 420 కేసు నమోదు చేస్తామని ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. దాడులలో విజిలెన్స్ ఎస్‌ఐ షేక్ ఖాశిం సైదా, సిబ్బంది పాల్గొన్నారు.
దాచేపల్లిలో 200 బస్తాలు
దాచేపల్లి: దాచేపల్లిలోని ఓ ఇంట్లో నిల్వ ఉంచిన 200 బస్తాల రేషన్‌బియ్యాన్ని విజిలెన్స్‌అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గురువారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. మందపాటి నరసింహారావు, చందు, హమీమ్, సీతరామయ్య, శ్రీహరి నెలకు రూ.200కు చెంచమ్మ అనే వృద్ధురాలి ఇల్లు అద్దెకు తీసుకొని బియ్యం నిల్వ చేశారని విజిలెన్స్ ఎస్‌ఐ షేక్ ఖాసీంసైదా చెప్పారు. ఈ ఐదుగురిపై 6ఎ కేసు, క్రిమినల్ కేసులు నమోదుచేశామన్నారు.
Advertisement
Advertisement