
16న ధర్నాలు
- రుణమాఫీ అమలులో ప్రభుత్వ తీరుకు నిరసనగా..
- పార్టీలకు అతీతంగా రైతులు, డ్వాక్రా మహిళలు పాల్గొనాలి
- వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు పార్థసారథి పిలుపు
కంకిపాడు : రుణమాఫీ అమలు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఈ నెల 16వ తేదీన అన్ని మండల కేంద్రాల్లోనూ ధర్నాలు నిర్వహించాలని వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కంకిపాడులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
రుణమాఫీపై ఆశతో టీడీపీకి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరూ 16న అన్ని మండల కేంద్రాల్లో జరిగే ధర్నాల్లో పాల్గొని తమ నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా రైతులు, మహిళలు ధర్నాల్లో పాల్గొని పాలకుల కళ్లు తెరిపించాలని కోరారు. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన చంద్ర బాబుకు ప్రజల ఇబ్బందులు పట్టడంలేదని విమర్శించారు.