సాక్షి, భీమవరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 175వ రోజు ప్రారంభమైంది. మంగళవారం ఉదయం పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడ నుంచి తలతాడితిప్ప, మెంతెపూడి క్రాస్, బొబ్బనపల్లి, మత్స్యపూరి, సీతారాంపురం క్రాస్ మీదగా కొప్పర్రు వరకూ వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగనుంది. జననేతను కలుసుకోవడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. వారి సమస్యలు తెలుసుకుంటూ, భరోసానిస్తూ రాజన్న బిడ్డ పాదయాత్ర కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment