ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఖాళీగా ఉన్న 18 ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పోస్టుల భర్తీకి నవంబర్ మొదటి వారంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిసింది. వీటిలో 16 జిల్లా పరిషత్ హైస్కూళ్లు కాగా రెండు ప్రభుత్వ హైస్కూళ్లు. పోస్టుల భర్తీపై పాఠశాల విద్య గుంటూరు ఆర్‌జేడీ పి.పార్వతి చర్యలు ప్రారంభించారు. పోస్టుల వివరాలను ఇప్పటికే డీఈఓ కార్యాలయం నుంచి తెలుసుకున్నారు.
పర్చూరు మండలం చెరుకూరు, ముండ్లమూరు మండలం వేముల, కొత్తపట్నం మండలం ఆలూరు, చీమకుర్తి మండలం గాడిపర్తివారిపాలెం, దేవరపాలెం, నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు, అర్ధవీడు మండలం కాకర్ల, తర్లుపాడు మండలం తాడివారిపల్లె, కంభం మండలం జంగంగుంట్ల, కంభం (బాలికలు), సింగరాయకొండ మండలం పాకల, తాళ్లూరు మండలం శివరాంపురం, పుల్లలచెరువు మండలం మర్రివేముల, బల్లికురవ మండలం కొమ్మినేనివారిపాలెం, మండల కేంద్రాలు గుడ్లూరు, దర్శి (బాలికలు) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలు సహా కంభం, పొదిలి (బాలికలు) ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో హెడ్మాస్టరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
18 హైస్కూలు హెచ్‌ఎం పోస్టులు ఖాళీ
Published Wed, Oct 30 2013 4:08 AM | Last Updated on Sat, Sep 2 2017 12:06 AM
Advertisement
Advertisement