
18 పులిగోర్లు స్వాధీనం
అరకులోయ (విశాఖపట్నం) : అక్రమంగా పులిగోర్లను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 18 పులిగోర్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పులిగోర్ల విలువ సుమారు రూ. లక్ష వరకు ఉంటుందని సమాచారం.
ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా అరకు రైల్వే స్టేషన్‌లో మంగళవారం జరిగింది. ముందస్తు సమాచారంతో మాటు వేసిన పోలీసులు పులిగోర్లను తరలిస్తున్న చింతపల్లి మండలానికి చెందిన ఒక వ్యక్తిని డుమ్రిగూడ మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.