శ్రీకాళహస్తి : వేగంగా వెళ్తున్న కారు, లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం తొండమనాడు క్రాస్ వద్ద గురువారం చోటు చేసుకుంది. నెల్లూరుకు చెందిన శ్రీరాములు కుటుంబ సభ్యులతో కలిసి తిరుచానూరులో జరుగుతున్న తమ బంధువుల శుభకార్యానికి హజరై తిరిగివస్తున్నారు. ఈ క్రమంలో కారు తొండమనాడు క్రాస్ వద్దకు రాగానే లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో పద్మజ, సంపూర్ణ మృతి చెందగా.. శ్రీరాములుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.