ఆరుగురు అరెస్టు, ఇద్దరు పరారీ
రోలుగుంట : అక్రమంగా తరలిస్తున్న 250 కిలోల గంజాయిని పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా ఇద్దరు పరారయ్యారు. కొత్తకోట సీఐ పి.వి.కృష్ణవర్మ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎం.కె.పట్నం- బి.బి.పట్నం మధ్యలో పక్షుల చెరువు టర్నింగ్‌లో శనివారం ఆరుగురు వ్యక్తులు ఎనిమిది గంజాయి బస్తాలతో వాహనం కోసం ఎదురు చూస్తున్నారు.
రూట్‌వాచ్ చేస్తున్న పోలీసులు అనుమానంతో వారిని అదుపులోకి తీసుకొని, బస్తాలు పరిశీలించగా గంజాయి బయటపడింది. వారి నుంచి 250 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్లో రూ. 25 లక్షలుంటుందని అంచనా. పట్టుబడిన వారిలో రావికమతం మండల ం కిత్తంపేటకు చెందిన శేనాపతి పరమేశు, మున్నూరి అప్పారావు, బేతిన రాజారావు, మచ్చా అప్పారావు, రోలుగుంట మండలం బి.బి.పట్నంకు చెందిన మచ్చా అప్పారావు, పోతురాజు ఈశ్వరరావు ఉన్నారు. వారిని అరెస్టు చేసి రిమాండ్ తరలించామని సీఐ పి.వి.కృష్ణవర్మ తెలిపారు. పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలిస్తున్నామన్నారు.
250 కేజీల గంజాయి స్వాధీనం
Published Sun, Nov 9 2014 3:07 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement