
పాదయాత్ర యువకులకు స్వాగతం పలుకుతున్న వైఎస్సార్‌సీపీ నాయకులు
యర్రగొండపాలెం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, యర్రగొండపాలెం ఎమ్మెల్యే డాక్టర్ ఆదిమూలపు సురేష్ విద్యాశాఖ మంత్రిగా నియమితులైన సందర్భంగా ముగ్గురు యువకులు హైదరాబాదులోని లోటస్‌పాండ్ నుంచి శ్రీశైలం వరకు చేపట్టిన పాదయాత్ర మంగళవారం యర్రగొండపాలెం చేరింది. వీరికి పార్టీ సీనియర్ నాయకుడు ఒంగోలు మూర్తిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎం, సురేష్ మంత్రి కావాలని లోటస్‌పాండ్‌నుంచి శ్రీశైలానికి పాదయాత్ర చేస్తామని వైపాలేనికి చెందిన యువకులు దగ్గుల కాశిరెడ్డి, అఖిల్‌బాష, అశోక్‌రెడ్డిలు మొక్కుకున్నారు. ఈ సందర్భంగా వారు ఈ నెల 11వ తేదీన పాదయాత్ర ప్రారంభించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు కె.ఓబులరెడ్డి, ఎన్.వెంకటరెడ్డి, జి.వెంకటరెడ్డి, ఒ.సుబ్బారెడ్డి, వెంకటస్వామి, రామచంద్రయ్య, రాములునాయక్, జి.రామిరెడ్డి, పి.శ్రీను, వై.రాంబాబు, అంకిరెడ్డి, పెద్దకాపు వెంకటరెడ్డి, జి.రామిరెడ్డి, జయరావులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment