srisailam foot journey
-
జగన్ సీఎం అయ్యాడని శ్రీశైలానికి పాదయాత్ర
యర్రగొండపాలెం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, యర్రగొండపాలెం ఎమ్మెల్యే డాక్టర్ ఆదిమూలపు సురేష్ విద్యాశాఖ మంత్రిగా నియమితులైన సందర్భంగా ముగ్గురు యువకులు హైదరాబాదులోని లోటస్పాండ్ నుంచి శ్రీశైలం వరకు చేపట్టిన పాదయాత్ర మంగళవారం యర్రగొండపాలెం చేరింది. వీరికి పార్టీ సీనియర్ నాయకుడు ఒంగోలు మూర్తిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. జగన్మోహన్రెడ్డి సీఎం, సురేష్ మంత్రి కావాలని లోటస్పాండ్నుంచి శ్రీశైలానికి పాదయాత్ర చేస్తామని వైపాలేనికి చెందిన యువకులు దగ్గుల కాశిరెడ్డి, అఖిల్బాష, అశోక్రెడ్డిలు మొక్కుకున్నారు. ఈ సందర్భంగా వారు ఈ నెల 11వ తేదీన పాదయాత్ర ప్రారంభించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు కె.ఓబులరెడ్డి, ఎన్.వెంకటరెడ్డి, జి.వెంకటరెడ్డి, ఒ.సుబ్బారెడ్డి, వెంకటస్వామి, రామచంద్రయ్య, రాములునాయక్, జి.రామిరెడ్డి, పి.శ్రీను, వై.రాంబాబు, అంకిరెడ్డి, పెద్దకాపు వెంకటరెడ్డి, జి.రామిరెడ్డి, జయరావులు పాల్గొన్నారు. -
80 ఏళ్ల వయస్సులో కాలినడకన శ్రీశైలానికి...
గట్టు (మహబూబ్నగర్): ఆమె వయసు 80కి పైనే. ఆమెలో హుషారు చూస్తే కుర్ర వయసేమో అన్నట్టుగా ఉంటుంది. శ్రీశైల మల్లికార్జునుడు అంటే అపార భక్తి. అందుకే 35 సంవత్సరాలుగా... ప్రతి ఏటా కర్ణాటక రాష్ట్రంలోని కలబురాగి జిల్లా దేవగిరి నుంచి కర్నూలు జిల్లాలోని శ్రీశైల పట్టణానికి కాలినడకనే వచ్చి స్వామిని దర్శించుకుని వెళుతుంటుంది. ఎనిమిది పదుల వయసులోనూ ఇంత హుషారుగా ఉంటున్న ఆమె పేరు బోరమ్మ. ఏడు రోజుల క్రితం కాలినడకన శ్రీశైల క్షేత్రానికి బయలుదేరిన బోరమ్మ బుధవారం మహబూబ్నగర్ జిల్లా గట్టుకు చేరుకుంది. తెలిసిన వారిళ్లలో కొంత సేపు సేదతీరింది. అల్పాహారం మాత్రమే తీసుకుంటూ పాదయాత్ర చేస్తోంది. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రతినిధి బోరమ్మను పలుకరించగా... వారం క్రితం ఇంటి నుంచి బయల్దేరానని, ఉగాది పండుగకు ముందే శ్రీశైలం చేరుకుంటానని తెలిపింది. అక్కడ స్వామికి పూజలు చేసి తిరుగు ప్రయాణమవుతానని, జీవితాంతం ఇలాగే పాదయాత్ర చేస్తూనే ఉంటానని తెలిపింది. తనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు బోరమ్మ వెల్లడించింది.