80 ఏళ్ల వయస్సులో కాలినడకన శ్రీశైలానికి... | old women foot journey at the age of 80 years | Sakshi
Sakshi News home page

80 ఏళ్ల వయస్సులో కాలినడకన శ్రీశైలానికి...

Published Wed, Mar 11 2015 6:16 PM | Last Updated on Sat, Sep 2 2017 10:40 PM

old women foot journey at the age of 80 years

గట్టు (మహబూబ్‌నగర్): ఆమె వయసు 80కి పైనే. ఆమెలో హుషారు చూస్తే కుర్ర వయసేమో అన్నట్టుగా ఉంటుంది. శ్రీశైల మల్లికార్జునుడు అంటే అపార భక్తి. అందుకే 35 సంవత్సరాలుగా... ప్రతి ఏటా కర్ణాటక రాష్ట్రంలోని కలబురాగి జిల్లా దేవగిరి నుంచి కర్నూలు జిల్లాలోని శ్రీశైల పట్టణానికి కాలినడకనే వచ్చి స్వామిని దర్శించుకుని వెళుతుంటుంది. ఎనిమిది పదుల వయసులోనూ ఇంత హుషారుగా ఉంటున్న ఆమె పేరు బోరమ్మ.

ఏడు రోజుల క్రితం కాలినడకన శ్రీశైల క్షేత్రానికి బయలుదేరిన బోరమ్మ బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా గట్టుకు చేరుకుంది. తెలిసిన వారిళ్లలో కొంత సేపు సేదతీరింది. అల్పాహారం మాత్రమే తీసుకుంటూ పాదయాత్ర చేస్తోంది. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రతినిధి బోరమ్మను పలుకరించగా... వారం క్రితం ఇంటి నుంచి బయల్దేరానని, ఉగాది పండుగకు ముందే శ్రీశైలం చేరుకుంటానని తెలిపింది. అక్కడ స్వామికి పూజలు చేసి తిరుగు ప్రయాణమవుతానని, జీవితాంతం ఇలాగే పాదయాత్ర చేస్తూనే ఉంటానని తెలిపింది. తనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు బోరమ్మ వెల్లడించింది.

Advertisement
Advertisement