
తెలుగు విద్యార్థులపై నార్త్ ఇండియా విద్యార్థుల దాడి
‘నారాయణ’లో తెలుగు విద్యార్థులపై ఇనుప రాడ్లు, కర్రలతో దాడి
పీఎం పాలెం (విశాఖపట్నం): విశాఖపట్నం శివారు మధురవాడలోని నారాయణ రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న ఉత్తరాది విద్యార్థులు దౌర్జన్యకాండకు పాల్పడ్డారు. అదే కళాశాలలో చదువుతున్న తెలుగు విద్యార్థులను ఇనుప రాడ్లు, కర్రలు, బెల్టులతో చితకబాదారు. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనలో 31మంది గాయపడ్డారు. పీఎం పాలెం సీఐ ఎస్.అప్పలరాజు, బాధిత విద్యార్థుల కథనం ప్రకారం...
ఈ కళాశాలలో జార్ఖండ్, రాజస్థాన్, బీహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాలకు చెందిన 190 మంది విద్యార్థులు సీబీఎస్‌సీ సెక్షన్‌లో చదువుతున్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అరకు, తదితర ప్రాంతాలకు చెందిన 110 మంది విద్యార్థులు స్టేట్ సిలబస్ బోధించే సెక్షన్‌లో విద్య అభ్యసిస్తున్నారు. వారి మధ్య శుక్రవారం సాయంత్రం భోజనాల సమయంలో వివాదం తలెత్తింది. ఇది పోలీసు స్టేషన్ వరకూ వెల్లడంతో కక్ష కట్టిన ఉత్తరాది విద్యార్థులు ఈ మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. దర్యాప్తు జరుగుతోంది.