నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఓ పెళ్లి బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ అధిక వేగంగా వాహనం నడపడం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని సాక్షులు తెలిపారు.
అలాగే ఖమ్మం జిల్లాలోని కర్ణగిరిలో డీసీఎం వ్యాన్ బైక్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులుకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహలను పోస్ట్మార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డీసీఎం వ్యాన్తోపాటు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. డ్రైవర్పై కేసు నమోదు చేశారు.
గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం మండలం వేమవరం బ్రిడ్జి వద్ద ఈ రోజు తెల్లవారుజామున రెండు లారీలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రంగారెడ్డి జిల్లాలోని బహదూర్గూడ వద్ద ఔటర్రింగ్ రోడ్డుపైన లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్కు తీవ్రగాయాలయ్యాయి.
మెదక్ జిల్లా జోగిపేట పోలీస్స్టేషన్ సమీపంలో వేగం వెళ్తున్న బైక్ ఓ వ్యక్తిని ఢీ కొట్టింది. బైక్ ఢీ కొన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. దాంతో బైక్ను అక్కడే వదిలి బైకిస్ట్ పరారైయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి, బైక్ను పోలీసుస్టేషన్కు తరలించారు. మృతి చెందిన వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి
Published Thu, Aug 22 2013 8:45 AM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM
Advertisement