
బల్లి పడిన భోజనం తిన్న విద్యార్థులు
పూసపాటిరాగ: విజయనగరం జిల్లా పూసపాటిరాగ మండలం కోనడ ప్రభుత్వ పాఠశాలకు చెందిన 50 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. వీటిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బల్లి పడిన మధ్యాహ్న భోజనం తినడంతో వీరు అస్వస్థతకు గురైనట్టు గుర్తించారు.
బాధిత విద్యార్థులకు పూసపాటిరాగ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.