హైదరాబాద్, న్యూస్‌లైన్: చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు హక్కుగా కల్పించాలని ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) డిమాండ్ చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవమైన మార్చి 8న ఇదే డిమాండ్‌తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రదర్శనలు, సదస్సులు జరపాలని పిలుపునిచ్చింది. రాష్ట్ర మహాసభల్లో చేసిన తీర్మానాల వివరాలను పీవోడబ్ల్యూ ఇరు రాష్ట్రాల సయన్వయ కమిటీ సభ్యులు సంధ్య, రమాసుందరి, డి. పద్మ, ఊకే పద్మ, ఎన్.విష్ణు మంగళవారం విలేకరులకు వివరించారు.
వరకట్న వేధింపులను నిరోధిస్తూ చే సిన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, ఆదివాసీ మహిళల ఉపాధి, నివాస, అటవీ హక్కులను పరిరక్షించే 5వ షెడ్యూల్‌ను అమలు చేయాలని, పోడు, అటవీ భూములపై ఆదివాసీలకే హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కుగా గుర్తించాలని, స్టీలు ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. 108 మాదిరిగా మహిళల రక్షణకు ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలన్నారు.
తెలంగాణకు సంధ్య, ఆంధ్రప్రదేశ్‌కు విష్ణు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో పీవోడబ్ల్యూ రాష్ట్ర మహాసభల్లో రెండు రాష్ట్రాలకు వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేశారు. పీవోడబ్ల్యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలిగా వి. సంధ్య, ఉపాధ్యక్షులుగా నర్సక్క, ఐలమ్మ, ప్రధానకార్యదర్శిగా ఊకే పద్మ, కార్యదర్శులుగా అనసూయ, సీత, కోశాధికారిగా సుభద్ర, సభ్యులుగా నిర్మల, రమ, లత, మేకల భారతి ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీవోడబ్ల్యూ అధ్యక్షులుగా ఎన్. విష్ణు, ఉపాధ్యక్షులుగా బి. రమాసుందరి, జయమ్మ, ప్రధానకార్యదర్శిగా బి. పద్మ, కార్యదర్శులుగా విజయ, శీలం ఏసమ్మ, కోశాధికారిగా అనసూయ, సభ్యులుగా రమ, శాంతి, ఎన్. సామ్రాజ్యం, ఎస్. భారతి, మేకల కల్పనలను ఎన్నుకున్నారు. ఇరు రాష్ట్రాల సయన్వయ కమిటీ సభ్యులుగా వి. సంధ్య, ఊకే పద్మ, ఎన్. విష్ణు, బి. పద్మ, బి. రమాసుందరిలను ఎన్నుకున్నారు.
చట్ట సభల్లో 50 శాతం కోటా ఇవ్వాలి
Published Wed, Mar 5 2014 1:33 AM | Last Updated on Tue, Mar 3 2020 7:07 PM
Advertisement