ఏపీ కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి.హరినాథ్
నూజివీడు : రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న బలవంత భూసేకరణను నిరసిస్తూ ఈనెల 9న భూ హక్కుల పరిరక్షణ కమిటీ సారథ్యంలో వేలాదిమందితో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ అనుబంధ సంఘం ఏపీ కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి.హరినాథ్ తెలిపారు. నూజివీడులో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు భూ బ్యాంక్ పేరుతో జిల్లాకు లక్ష ఎకరాల చొప్పున 13 జిల్లాల్లో 13 లక్షల ఎకరాలను రైతులు, పేదల నుంచి లాక్కుంటున్నారని, వీటిలో పట్టా భూములు, అసైన్‌డ్డ, సీలింగ్ తదితర భూములున్నాయన్నారు. వీటన్నింటినీ సింగపూర్, జపాన్ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం చూస్తున్నం దున ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
భూకుంభకోణంపై విచారణ జరిపించాలి
రాజధాని ప్రాంతంలో అధికార పార్టీ మద్దతుతో జరుగుతున్న భూ ఆక్రమణ, కుంభకోణాల దందా వెలుగులోకి రావడం మంచి పరిణామమని, దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని హరినాథ్ డిమాండ్ చేశారు. అమరావతికి బడ్జెట్‌లో నిధులు కేటాయించనందున చంద్రబాబు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాలని, లేనిపక్షంలో ప్రజల నుంచి నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
9న సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి
Published Sat, Mar 5 2016 12:28 AM | Last Updated on Sun, Sep 3 2017 7:00 PM
Advertisement