సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియకు పాఠశాల విద్యాశాఖ మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఉత్తర్వులు జారీచేశారు. బదిలీలకు ముందుగా చేపట్టిన స్కూళ్ల రేషన లైజేషన్ ప్రక్రియ ఈనెల 9వ తేదీతో ముగిస్తారు. అదే రోజు నుంచి బదిలీలకు ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరిస్తారు.
రేషన లైజేషన్ అనంతరం మిగిలిన ఖాళీ పోస్టు లను జూన్ 11న వెల్లడిస్తారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం 8 ఏళ్లు ఒకేచోట పూర్తిచేసిన టీచర్లకు, 5 ఏళ్లు పూర్తిచేసిన హెడ్మాస్టర్లకు బదిలీ తప్పనిసరి. పదవీ విరమణకు రెండేళ్ల కాల పరిమితి ఉన్న వారిని బదిలీ నుంచి మినహాయిస్తారు. బాలికల హైస్కూళ్లలో మహిళా టీచర్లు, హెచ్‌ఎంలు అందుబాటులో లేని పక్షంలో మాత్రమే 50 ఏళ్లు పైబడిన పురుష టీచర్, హెచ్‌ఎంలను నియమిస్తారు. రేషనలైజేష న్ అనంతరం మిగిలిఉన్న టీచర్లను సర్దు బాటు చేసేందుకు తీసుకోవలసిన చర్య లపై కూడా జీవోలో పొందుపర్చారు.
9 నుంచి టీచర్ల బదిలీ ప్రక్రియ ప్రారంభం
Published Wed, Jun 7 2017 3:08 AM | Last Updated on Tue, Sep 5 2017 12:57 PM
Advertisement