ఏపీ: 9712 పోస్టుల భర్తీకి ఆదేశాలు | 9712 Posts In Andhra Pradesh Medical And Health Department To Be Filled | Sakshi
Sakshi News home page

ఏపీ: వైద్యారోగ్య శాఖలో 9712 పోస్టుల భర్తీకి ఆదేశాలు

Published Thu, Jun 11 2020 7:06 PM | Last Updated on Thu, Jun 11 2020 7:53 PM

9712 Posts In Andhra Pradesh Medical And Health Department To Be Filled - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజారోగ్య రంగంలో సదుపాయాలను మెరుగుపరచడంపై దృష్టి సారించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వైద్యారోగ్య శాఖలో 9712 పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, వైద్యులు, లాబ్ టెక్నిషియన్లు, ఇతర ఖాళీల భర్తీకై వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో 4131, ఏపీవీవీపీ పరిధిలో 2414, డీపీహెచ్ పరిధిలో 3167 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 2153 రెగ్యులర్ పోస్టులు, 5574 కాంట్రాక్ట్ పోస్టులు, 1985 ఔట్ సోర్సింగ్ పోస్టులు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement