
ముద్రగడ హక్కును కాలరాయలేం
- హైకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు
- ముద్రగడతో సహా ప్రభుత్వానికి, పోలీసులకు నోటీసులు
- కౌంటర్ల దాఖలుకు ఆదేశం.. విచారణ రెండు వారాలకు వారుుదా
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన సత్యా గ్రహ పాదయాత్ర విషయంలో జోక్యం చేసు కునేందుకు హైకోర్టు నిరాకరించింది. నిరసన తెలిపే హక్కు ఈ దేశ పౌరునిగా పద్మ నాభంకు ఉందని, ఆ హక్కును తాము కాల రాయలేమని స్పష్టం చేసింది. శాంతిభద్రత లను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభు త్వానిదేనని తేల్చిచెప్పింది. హింస, విధ్వం సానికి ఎవరైనా పాల్పడితే కఠినంగా వ్యవ హరించవచ్చునని చెప్పింది. శాంతిభద్రతల పరిరక్షణకు ఏం చేయాలో ప్రభుత్వానికి తాము చెప్పాల్సిన అవసరం లేదంది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న సీఎస్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్, ఎస్‌పీలతో పాటు ముద్రగడకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
తదుపరి విచారణను రెండు వారాలకు వారుుదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముద్రగడ ఈ నెల 16 నుంచి తలపెట్టిన పాదయాత్రను చట్ట విరుద్ధంగా ప్రకటించా లని కోరుతూ రాజమండ్రికి చెందిన న్యాయ వాది మేడా శ్రీనివాస్ హైకోర్టులో గతవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిని మంగళవారం ఏసీజే నేతృ త్వంలోని ధర్మాసనం విచారించింది. పిటిష నర్ తరఫు సీనియర్ న్యాయవాది ఎల్.రవి చందర్, అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. అనం తరం ధర్మాసనం పాదయాత్ర చేపట్టకుండా ముద్రగడను అడ్డుకోలేమని స్పష్టం చేసింది. హింస, విధ్వంస ఘటనలు జరగకుండా ప్రభుత్వం చూడాలని స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యాన్ని స్వీకరిస్తున్నట్లు పేర్కొంటూ విచారణను వారుుదా వేసింది.