kapu satyagraha yarta
-
ఉక్కుపాదం మోపినా ఉద్యమం తప్పదు
చంద్రబాబుకు ముద్రగడ బహిరంగ లేఖ సాక్షి ప్రతినిధి, కాకినాడ : కాపు జాతికి బీసీ రిజర్వేషన్లు పునరుద్ధరిస్తామంటూ ఇచ్చిన హామీ నెరవేర్చాలని కోరుతూ చేపడుతున్న ఉద్యమంపై ఉక్కుపాదం మోపేందుకు సీఎం చంద్రబాబు చూస్తున్నారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. అరుునప్పటికీ ఉద్యమ పథం నుంచి వెనక్కు మళ్లేది లేదన్నారు. ఈ నెల 15న రావులపాలెం బయలుదేరిన తనను పోలీసులు అడ్డగించి గృహ నిర్బంధం చేయడం బాధాకరమని అన్నారు.3రోజుల గృహ నిర్బంధం అనంతరం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును తమ జాతే కాదు.. ఏ జాతీ క్షమించదని, అబద్ధాలు చెప్పి పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. వచ్చే నెల 2న కాకినాడలో 13 జిల్లాలకు చెందిన పెద్దలతో జేఏసీ సమావేశం జరిపి కార్యాచరణను నిర్ణరుుంచుకుంటామని స్పష్టం చేశారు. ఈమేరకు ఆయన సీఎంకు బహిరంగ లేఖ రాశారు. -
ప్రతి కదలిక బాడీ వార్న్ కెమెరాలతో చిత్రీకరణ
కాకినాడ: కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద పోలీసులు గృహనిర్భంధం నాలుగోరోజు శుక్రవారం కూడా కొనసాగుతోంది. పోలీసులు ఇచ్చిన 48 గంటలు గడువు ముగిసినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. అంతేకాకుండా ముద్రగడ నివాసం వద్ద ప్రతి కదలికను పోలీసులు బాడీ వార్న్ కెమెరాలతో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ పోలీసుల నుంచి తనకు స్వేచ్ఛ కలిగినప్పుడే జేఏసీతో చర్చించి సత్యాగ్రహ యాత్రపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎన్నిరోజులు ఇంట్లో ఉండమంటే అన్ని రోజులూ ఉంటానని, పోలీసులు వెళ్లిపోయి తనకు స్వేచ్ఛ ఇస్తే పాదయాత్ర చేపడతానని అన్నారు, పోలీసులు వెనక్కు వెళ్లిపోతే పాదయాత్ర తేదీలు ప్రకటిస్తానని ముద్రగడ స్పష్టం చేశారు. మరోవైపు కాపు జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు, వాసురెడ్డి ఏసుదాసు ,కల్వకొలను తాతాజీ, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా తదితరుల గృహ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. కాగా రావులపాలెం నుంచి అంతర్వేది వరకు కాపు సత్యాగ్రహ పాదయాత్రకు సిద్ధమయిన ముద్రగడ సహా పలువురు కాపు జేఏసీ నేతలను మంగళవారం ప్రభుత్వం నిర్బంధించిన సంగతి తెలిసిందే. -
ముట్టడిలోనే ముద్రగడ
- గడువు ముగిసినా కొనసాగుతున్న నిర్బంధం - పోలీసులు వెళ్లాక పాదయాత్ర తేదీలు ప్రకటిస్తా - యాత్ర చేసితీరతామంటున్న కాపు ఉద్యమనేత సాక్షి ప్రతినిధి, కాకినాడ : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గృహనిర్భంధం మూడో రోజు గురువారం కూడా కొనసాగుతోంది. పోలీసులు ఇచ్చిన 48 గంటలు గడువు గురువారం రాత్రితో ముగిసింది. గడువు ముగిసినా నిర్బంధంలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. అరుుతే కాస్త సడలింపు ఇవ్వడంతో మూడోరోజు ముద్రగడను స్థానికులు కలిశారు. గడువు ముగియడంతో గృహనిర్బంధాన్ని ఉపసంహరించుకుంటారా లేదా అనే విషయంపై పోలీసుల నుంచి స్పష్టత రావడం లేదు. ముద్రగడ సహా కాపు నేతలను మూడో రోజు కూడా గృహ నిర్బంధంలోనే ఉంచడంతో కాపు యువత ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతోంది. రావులపాలెం నుంచి అంతర్వేది వరకు కాపు సత్యాగ్రహ పాదయాత్రకు సిద్ధమవగా ముద్రగడ సహా పలువురు కాపు జేఏసీ నేతలను మంగళవారం ప్రభుత్వం నిర్బంధించిన సంగతి తెలిసిందే. అరుుతే మూడో రోజు సాయంత్రం నుంచి కాస్త సడలింపు ఇచ్చారు. బుధవారం ముద్రగడను కలిసేందుకు వచ్చిన బంధువులను సైతం ఇంట్లోకి అడుగుపెట్టనీయకుండా అడ్డుకున్న పోలీసులు గురువారం మీడియాతోపాటు స్థానికులను కూడా అనుమతించారు. కాగా కాపు జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు, కల్వకొలను తాతాజీ, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా తదితరుల గృహ నిర్బంధాలు గురువారం కూడా కొనసాగారుు. పోలీసులు వెళ్లిపోతేనే తేదీలు ప్రకటిస్తా.. ఫలానా తేదీ నుంచి తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తామని ముద్రగడ గానీ మరెవరైనా చెబితే పోలీసు బలగాలను ఉపసంహరించుకుంటామని పోలీసు అధికారులు చెబుతున్నారు. ముద్రగడ మాత్రం ముందుగా పోలీసులు తప్పుకుని స్వేచ్ఛ ఇచ్చాక పాదయాత్ర చేసి తీరతానంటున్నారు. పాద యాత్ర చేయడం మాత్రం ఖాయమంటున్నారు. అందుకు పోలీసుల అనుమతి తీసుకునే ప్రసక్తే లేదన్నారు. ఇదే విషయాన్ని గురువారం రాత్రి తనను కలిసిన మీడియా వద్ద మరోసారి స్పష్టం చేశారు. ఎన్నిరోజులు ఇంట్లో ఉండమంటే అన్ని రోజులూ ఉంటానని, పోలీసులు వెళ్లిపోయి తనకు స్వేచ్ఛ ఇస్తే పాదయాత్ర చేపడతాను, పోలీసులు వెనక్కు వెళ్లిపోతే పాదయాత్ర తేదీలు ప్రకటిస్తానని ముద్రగడ స్పష్టం చేస్తున్నారు. -
స్వేచ్చా హననం
-
‘తూర్పు’ నివురుగప్పిన నిప్పు
-
‘తూర్పు’ నివురుగప్పిన నిప్పు
- పోలీసు చక్రబంధంలో ముద్రగడ - అంబటి సహా పలువురు నేతల నిర్బంధం సాక్షిప్రతినిధి, కాకినాడ /రాజమహేంద్రవరం: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన ‘కాపు సత్యాగ్రహ యాత్ర’ను రాష్ట్ర ప్రభుత్వం భగ్నం చేయడంతో తూర్పు గోదావరి జిల్లా నివురుగప్పిన నిప్పులా మారింది. కాపు నేతల అరెస్టులు, గృహ నిర్బంధాలు రెండో రోజు బుధవారం కూడా కొనసాగారుు. ముద్రగడను పరామర్శించడం కోసం వెళుతున్న వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, జక్కంపూడి రాజా ప్రభృతులను అరెస్టుచేసి సాయంత్రం వరకు పోలీస్‌స్టేషన్ లో నిర్బంధించారు. తర్వాత అంబటిని గుంటూరుకు బలవంతంగా తరలించారు. ముద్రగడ పద్మనాభంను మంగళవారం నుంచి పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి తెల్సిందే. డ్రోన్లు, బెల్ట్ కెమెరాలతో ముద్రగడ ఇంటి ప్రాంతాన్ని నిఘా నీడలో ఉంచారు. 2 వేల మంది పోలీ సులు పహారా కాస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలపై దాష్టీకం.. ముద్రగడను కలిసి ఆరోగ్యం విషయం తెలుసుకునేందుకు రాజమహేం ద్రవరం నుంచి బయలుదేరిన వైఎస్సార్సీపీ నేతలు రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, పెద్దాపురం కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు, పార్టీ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్నిలను పోలీసులు ప్రత్తిపాడు జాతీయ రహదారిపై అడ్డగించారు. కారు దింపేసి పోలీసు జీపులో రాజమహేం ద్రవరం రూరల్ బొమ్మూరు పోలీస్ స్టేషన్‌కు తరలించి నిర్బంధించారు. సాయం త్రం 6 గంటలకు అంబటి నుంచి జిల్లా నేతలను వేరుచేసి స్టేషన్లో మరో గదిలో నిర్బంధించారు. ఆ తరువాత అంబటిని జిల్లాలో ఉండటానికి వీలులేదంటూ ఆదేశిం చారు. అందుకు రాంబాబు నిరాకరిస్తూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు రాంబాబును బలవంతంగా తమ వాహనంలో ఎక్కించుకుని రావులపాలెం వైపు తీసుకువెళ్లిపోయారు. అక్కడి నుంచి గుంటూరు తీసుకువెళ్లారు. కోర్టుకు తీసుకెళ్తా మంటూ వివిధ వాహనాల్లో మార్చి అంబటి పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఉద్యమాన్ని ఆపలేరు: అంబటి పోలీసు బలగాలతో ఉద్యమాలను ఆపలేరని, ఆలా చేస్తే ఉద్యమం మరింత ఉధృతమౌతుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు హెచ్చరించారు. బొమ్మూరులో అంబటి విలేకరులతో మాట్లాడుతూ కనీసం ముద్రగడను పరామర్శించడానికి అవకాశం లేకుండా అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. ముద్రగడను ఒంటిరిని చేసి మానసికంగా హింసించాలనుకుంటున్నారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సత్యాగ్రహ పాదయాత్రను ఆపే హక్కు ఎవరికీ లేదని హైకోర్టు తీర్చు చెప్పిందని గుర్తు చేశారు. పోలీసు బలగాలను మోహరించి భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. -
కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితులు
కిర్లంపూడి: బీసీ రిజర్వేషన్ల కోసం కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం తూర్పు గోదావరి జిల్లా రావుల పాలెం నుంచి తలపెట్టిన ‘కాపు సత్యాగ్రహ యాత్ర’కు బ్రేక్ పడింది. ముద్రగడ పాదయాత్ర యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. నేడు ఆయన సత్యాగ్రహ యాత్ర చేపట్టనున్న నేపథ్యంలో నిన్న(మంగళవారం) నుంచే పోలీసులు ఉద్యమనేత ముద్రగడను కిర్లంపూడిలోని ఆయన స్వగృహంలో హౌస్ అరెస్ట్ చేశారు. ముద్రగడ నివాసం చుట్టూ పోలీసులు పహారా కాస్తున్నారు. కిర్లంపూడితో పాటు కొనసీమలోనూ భారీగా పోలీసులను మోహరించారు. ముద్రగడతో పాటు మరికొందరు జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ, సాధనాల శ్రీనివాస్, ఈవై దాసు, నల్లా విష్ణు, కలవ కొలను తాతాజీ, పవన్ తదితరులను పోలీసులు రావులపాలెంలో అరెస్ట్ చేసి కాకినాడ 3వ టౌన్ పోలీసు స్టేషన్లో నిర్బంధించారు. కాపు నేతలపై ఉక్కుపాదం మోపిన నేపథ్యంలో కోనసీమ నివురుగప్పిన నిప్పులా ఉంది. కాపులను బీసీ జాబితాలో చేర్చాలనే డిమాండ్‌తో కాపు జేఏసీ ఆధ్వర్యంలో ముద్రగడ ఈ నెల 16 (బుధవారం)న రావులపాలెం నుంచి సత్యాగ్రహ యాత్రకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. రావులపాలెం నుంచి పాదయాత్ర అంతర్వేది వరకు ఐదురోజులపాటు నిర్వహించాలని కాపు నేతలు నిర్ణయించగా పోలీసులు ముందుగానే ఉద్యమనేతను యాత్రను భగ్నం చేశారు. మంగళవారం సాయంత్రం ముద్రగడ కిర్లంపూడిలోని స్వగృహం నుంచి కారులో బయలుదేరగా గేటు బయట పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదని, శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయన్న కారణంతోనే ముద్రగడను హౌస్ అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. -
కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితులు
-
ముద్రగడ గృహనిర్బంధం
- కాపు సత్యాగ్రహ యాత్రకు బ్రేక్ - కాపునేతలపై రాష్ట్రప్రభుత్వ ఉక్కుపాదం సాక్షి, కాకినాడ/అమరావతి/ఏలూరు: బీసీ రిజర్వేషన్ల కోసం కాపు ఉద్యమ నేత ముద్రగ డ పద్మనాభం తూర్పు గోదావరి జిల్లా రావుల పాలెం నుంచి తలపెట్టిన ‘కాపు సత్యాగ్రహ యాత్ర’కు బ్రేక్ పడింది. ముద్రగడను గృహ నిర్బంధం చేయడం ద్వారా పోలీసులు పాద యాత్ర ప్రయత్నాన్ని భగ్నం చేశారు. కోనసీ మలో కాపు జేఏసీ నేతలు, ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న నాయకులను కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మరికొం దరు జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ, సాధనా ల శ్రీనివాస్, ఈవై దాసు, నల్లా విష్ణు, కలవ కొలను తాతాజీ, పవన్ తదితరులను పోలీసు లు రావులపాలెంలో అరెస్ట్ చేసి కాకినాడ 3వ టౌన్ పోలీసు స్టేషన్లో నిర్బంధించారు. కాపు నేతలపై ఉక్కుపాదం మోపిన నేపథ్యంలో కోనసీమ నివురుగప్పిన నిప్పులా ఉంది. కాపులను బీసీ జాబితాలో చేర్చాలనే ప్రధాన డిమాండ్‌తో కాపు జేఏసీ ఆధ్వర్యంలో ముద్ర గడ ఈ నెల 16 (బుధవారం) రావులపాలెం నుంచి సత్యాగ్రహ యాత్రకు పిలుపునిచ్చారు. పాదయాత్ర అంతర్వేది వరకు ఐదురోజులపాటు నిర్వహిం చాలని నిర్ణరుుంచారు. రావుల పాలెంలో బుధవారం ఉదయం పాదయాత్ర ప్రారంభించేం దుకు మంగళవారం సాయం త్రం ముద్రగడ కిర్లంపూడిలోని స్వగృహం నుంచి కారులో బయలుదేరగా గేటు బయట పోలీసులు అడ్డుకున్నారు. పాద యాత్రకు అనుమతి లేదని, శాంతి భద్రతల సమస్య ఉండ టంతో గృహనిర్భంధం చేస్తున్న ట్టు పోలీసులు ప్రకటించారు. తాను సంఘ విద్రోహినా, గృహ నిర్బంధం ఎంతకాలమో చెప్పాలని ముద్రగడ డిమాండ్ చేశారు. పోలీసులు గంట సమయం అడిగి ఉన్నతాధి కారులతో సంప్రదించి చెబుతామనడంతో ఆయన వెనుతిరిగారు. శాంతిభద్రతల సమ స్య ఉత్పన్నమవుతాయని, ముద్రగడ పాద యాత్ర నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని రాజమహేంద్రవరానికి చెందిన మేడా శ్రీనివాస్ హైకోర్టుకు వెళ్లగా పాదయాత్రను నిలువరించాల్సిన అవసరం లేదని కోర్టు తీర్పు ఇచ్చింది. కానీ ముందు నుంచి అనుకున్నట్టే.. అనుమతి లేదనే కారణంతో ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలీసులు ముద్రగడ పాదయాత్రకు బ్రేకులు వేశారు. పాదయాత్ర తాత్కాలికంగా వారుుదా పడిందని, త్వరలో తేదీలు ప్రకటిస్తామని ముద్రగడ వెల్లడించారు. సర్కారు ముందస్తు వ్యూహం.. కోనసీమలో ప్రత్యేకించి అమలాపురం, రాజో లు తదితర ప్రాంతాలలో అరెస్ట్‌ల పర్వం ప్రారంభం కానుందని పోలీసులే వదంతులు వ్యాపింపజేసి భయోత్పాతం సృష్టించారు. పలువురు నేతలు అజ్ఞాతంలోకి వెళ్లేలా చేశారు. వేలాది మంది పోలీసుల్ని కోనసీమకు రప్పిం చిన రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివే స్తామని బెదిరింపులకు దిగింది. ఎట్టిపరిస్థితు ల్లోనూ ముద్రగడ పాదయాత్రను జరగనీ యకుండా చేస్తామని పదేపదే ప్రకటనలు చేస్తూ వచ్చిన రాష్ట్ర హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మంగళ వారం ఉదయం నుంచే పోలీసు ఉన్న తాధికారులతో మాట్లాడుతూ.. బయటకు వచ్చిన వాళ్లను వచ్చినట్టు అరెస్ట్ చేయాల్సిందిగా మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. ముందస్తు వ్యూహంలో భాగంగానే బలిజ చైతన్య యాత్రకు దిగిన కాపు కార్పొరేషన్ ఛైర్మన్ రామానుజయను ముందుకు సాగనీయకుండా చేసి ఆ తర్వాత ముద్రగడను నిర్బంధించారు. రాష్ట్రంలో రావణాసురుడు అన్నయ్య పాలన ‘‘రాష్ట్రంలో రావణాసురుడు అన్నయ్య పాలనను చూస్తున్నాం. మా హక్కుల కోసం పోరాడుతూ కోల్పోరుున రిజర్వేష న్లు మాత్రమే కోరుతున్నాం. ఇతర కులా లకు ఇబ్బంది లేకుండా రిజర్వేషన్లు కల్పిం చాలని కోరుతున్నాం. ప్రభుత్వం మాత్రం ఇతర కులాలను రెచ్చగొడుతోం ది. బాబు పాదయాత్ర ద్వారా ఇచ్చిన హామీని పాదయాత్ర ద్వారానే గుర్తు చేయాలని జేఏసీ నిర్ణరుుంచింది. పాదయాత్రలపై టీడీపీకి ఒక చట్టం మాకొక చట్టమా? చంద్రబాబు పాదయాత్రకు పర్మిషన్ తీసుకున్నారా? రిజర్వేషన్లు సాధించే వరకు నిరసనలు కొనసాగిస్తాం..’’ - కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం -
ముద్రగడ హక్కును కాలరాయలేం
- హైకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు - ముద్రగడతో సహా ప్రభుత్వానికి, పోలీసులకు నోటీసులు - కౌంటర్ల దాఖలుకు ఆదేశం.. విచారణ రెండు వారాలకు వారుుదా సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన సత్యా గ్రహ పాదయాత్ర విషయంలో జోక్యం చేసు కునేందుకు హైకోర్టు నిరాకరించింది. నిరసన తెలిపే హక్కు ఈ దేశ పౌరునిగా పద్మ నాభంకు ఉందని, ఆ హక్కును తాము కాల రాయలేమని స్పష్టం చేసింది. శాంతిభద్రత లను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభు త్వానిదేనని తేల్చిచెప్పింది. హింస, విధ్వం సానికి ఎవరైనా పాల్పడితే కఠినంగా వ్యవ హరించవచ్చునని చెప్పింది. శాంతిభద్రతల పరిరక్షణకు ఏం చేయాలో ప్రభుత్వానికి తాము చెప్పాల్సిన అవసరం లేదంది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న సీఎస్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటు ముద్రగడకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వారుుదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముద్రగడ ఈ నెల 16 నుంచి తలపెట్టిన పాదయాత్రను చట్ట విరుద్ధంగా ప్రకటించా లని కోరుతూ రాజమండ్రికి చెందిన న్యాయ వాది మేడా శ్రీనివాస్ హైకోర్టులో గతవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిని మంగళవారం ఏసీజే నేతృ త్వంలోని ధర్మాసనం విచారించింది. పిటిష నర్ తరఫు సీనియర్ న్యాయవాది ఎల్.రవి చందర్, అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. అనం తరం ధర్మాసనం పాదయాత్ర చేపట్టకుండా ముద్రగడను అడ్డుకోలేమని స్పష్టం చేసింది. హింస, విధ్వంస ఘటనలు జరగకుండా ప్రభుత్వం చూడాలని స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యాన్ని స్వీకరిస్తున్నట్లు పేర్కొంటూ విచారణను వారుుదా వేసింది. -
ముద్రగడ సత్యాగ్రహ యాత్ర వాయిదా
-
ముద్రగడ పాదయాత్రకు హైకోర్టు అంగీకారం
-
ముద్రగడ పాదయాత్రకు హైకోర్టు అంగీకారం
కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం తలపెట్టిన సత్యాగ్రహ పాదయాత్రకు హైకోర్టు అంగీకారం తెలిపింది. ఆయన యాత్ర చేసినంత మాత్రాన శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పడం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని, ఒకవేళ ఏదైనా శాంతిభద్రతల సమస్యలు వస్తే పోలీసులు చూసుకోవాలని స్పష్టం చేసింది. ముద్రగడ నేతృత్వంలో కోనసీమలో చేపట్టనున్న సత్యాగ్రహ పాదయాత్ర తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోలేదంటూ ఓ పక్క చెబుతూనే.. మరో పక్క భారీగా పోలీసులను మోహరిస్తున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా యాత్రను అడ్డుకోవాలని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసినా, కోర్టు కూడా ఆయనకు సానుకూలంగా ఉత్తర్వులు వెలువరించింది. దాంతో ఆయన యాత్రపై ఉత్కంఠ నెలకొంది. కాపులను బీసీల్లో చేర్చాలనే ప్రధాన డిమాండ్‌తో ఈ నెల 16 నుంచి 21 వరకూ ముద్రగడ ఆధ్వర్యంలో కాపు ఉద్యమకారులు సత్యాగ్రహ పాదయాత్ర చేపడుతున్నారు.